ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వాడే వారిలో చాలామంది ఫోన్లలో ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను వాడుతూ ఉంటారు. వేర్వేరు అవసరాల నిమిత్తం వేర్వేరు సిమ్ కార్డులను వినియోగిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సిమ్ కార్డ్ మిస్ కావడం లేదా బ్లాక్ కావడం జరుగుతుంది. సిమ్ కార్డ్ మిస్ అయినా బ్లాక్ అయినా ఇబ్బందులు పడక తప్పదు. చాలామందికి వాళ్లు జరిపే బ్యాంక్ లావాదేవీలకు సిమ్ కార్డు ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే.
Also Read: టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్..: పరీక్షలు ఎప్పుడో తెలుసా..?
దేశంలో జరుగుతున్న వేల సంఖ్యలో మోసాలు సిమ్ స్వాపింగ్ ద్వారానే జరుగుతుండటం గమనార్హం. తాజాగా హైదరాబాద్ పోలీసులు సిమ్ స్వాపింగ్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలో నైజీరియాకు చెందిన జేమ్స్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. గతంలో జరిగిన పలు సైబర్ మోసాల్లో కూడా జేమ్స్ నేరస్థుడని పోలీసులు చెబుతున్నారు. గతేడాది వచ్చిన కొన్ని కేసుల్లో ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విచారణ జరిపి ఈ ముఠాను అరెస్ట్ చేస్తున్నారు.
Also Read: రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
ఈ ముఠా మొదట సిమ్ కార్డును బ్లాక్ చేసి ఆ తరువాత అదే నంబర్ తో కొత్త సిమ్ కార్డును యాక్టివేట్ అయ్యేలా చేస్తుంది. ఇందుకోసం ముఠా ఫేక్ డాక్యుమెంట్లను ఉపయోగించినట్టు తెలుస్తోంది. 15 మొబైల్ ఫోన్లు, ఫేక్ ఆధార్ కార్డులు, రబ్బర్ స్టాంపులు, లెటర్ ప్యాడ్ లతో ముఠా ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఎవరిదైనా సిమ్ కార్డ్ బ్లాక్ అయ్యి అదే నంబర్ పని చేస్తున్నట్టు గుర్తిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఫిషింగ్ మెయిల్స్ ద్వారా బ్యాంక్ డీటెయిల్స్, రిజిస్టర్ మొబైల్ నెంబర్స్ ను ఈ ముఠా సేకరిస్తోందని తెలుస్తోంది. జేమ్స్ ఈ విధంగా సమాచారం ఇవ్వగా అతని ముఠాలోని సభ్యులు మోసాలకు పాల్పడేవారు. మొబైల్ కు వచ్చిన బ్యాంక్ వన్ టైమ్ పాస్ వర్డ్ ల ద్వారా మోసాలకు చెక్ పెట్టవచ్చు.