అమ్మాయిలు, అబ్బాయిలలో చాలామంది తక్కువ ఎత్తు ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామంది ఎత్తు పెరగాలని కష్టపడినా 21 సంవత్సరాల వయస్సు తరువాత ఎత్తు పెరగడం సాధ్యం కాదు. వ్యాయామాలు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉన్నా కొంతవరకే ఫలితం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి మాత్రం తాను మూడు అంగుళాల ఎత్తు పెరగాలని భావించి సక్సెస్ అయ్యారు.
Also Read: కరోనా వైరస్ కొత్త లక్షణం… కంటిచూపుకే ప్రమాదం..?
అమెరికాకు చెందిన 28 సంవత్సరాల వ్యక్తి ఆల్ఫోన్సో ఫ్లోరెస్ యొక్క ఎత్తు ఐదు అడుగుల 11 అంగుళాలు. అయితే ఆ ఎత్తుతో ఆ వ్యక్తికి సంతృప్తి దొరకలేదు. మరింత ఎత్తు పెరగాలని భావించి లాస్‌వెగాస్‌లోని డాక్టర్ కెవిన్ డెబీపర్షద్ అనే వైద్యుడిని సంప్రదించాడు. ఆ వైద్యుడు లింబ్ లెంథనింగ్ అనే కాస్మటిక్ సర్జరీ చేయించుకోవాలని సూచనలు చేశారు. ఆల్ఫోన్సో ఫ్లోరెస్ ఆ సర్జరీ చేయించుకోవడానికి ఆసక్తి చూపాడు.
Also Read: రేగు పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
సర్జరీ తరువాత ఆ వ్యక్తి 5 అడుగుల 11 అంగుళాల నుంచి 6 అడుగుల 2 అంగుళాలకు పెరిగాడు. ఈ సర్జరీ కోసం యువకుడు ఏకంగా 55 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 2020 సంవత్సరం ఆగష్టు నెలలో ఈ సర్జరీ జరగగా ఆల్ఫోన్సో ఫ్లోరెస్ కు సర్జరీ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కాలేదని తెలుస్తోంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి సర్జరీల వల్ల సైడ్ ఎఫెట్స్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.
మరిన్ని వార్తలు కోసం: ఇంటర్నేషనల్
సాధారణంగా ఎత్తు పెరగాలే తప్ప చికిత్సల ద్వారా ఎత్తు పెరగాలని అనుకోకూడదని వైద్యనిపుణులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడు ఎత్తు పెరగడానికి చికిత్స చేయించుకుని ఆ తరువాత నడవడం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.