Liver Health: మనిషికి లివర్ చాలా ముఖ్యం. రక్తంలోని విష పదార్థాలను అది తొలగిస్తోంది. పైగా శరీరానికి అవసరమైనప్పుడు శక్తిని అందించడంతో పాటు ఎన్నో పనులను లివర్ చేస్తోంది. అయితే నిత్యం మనం తీసుకునే ఆహారంతో పాటు, కాలుష్యం, మద్యపానం, ధూమపానం, అనారోగ్యాలు తదితర కారణాల వల్ల లివర్ కి సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. లివర్ కి ఎప్పుడైతే సమస్య వస్తోందో.. అప్పుడు మన దేహం అస్వస్థతకు లోనవుతుంది. అయితే కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను నిత్యం ఆహారంలో తీసుకుంటే లివర్ పనితనాన్ని మెరుగుపరవచ్చు. పైగా లివర్‌లో ఉన్న విష పదార్థాలు తొలగిపోతాయి.
మరి ఆ ఆహారాలు ఏమిటో చూద్దాం రండి.
పసుపు :
లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో పసుపు అద్భుతంగా పని చేస్తోంది. కాబట్టి.. మీరు రోజూ తీసుకునే ఆహారంలో పసుపు మోతాదును కాస్త పెంచుకోండి. అలాగే మన శరీరంలోని కొవ్వులను కరిగించడానికి కూడా ఈ పసుపు ఎంతో దోహదం చేస్తోంది.
క్యాబేజీ :
కాలేయ శుద్ధీకరణకు క్యాబేజీ చాలా బాగా ఉపయోగపడుతుందని చాలామందికి తెలియదు. క్యాబేజీ కాలేయంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. పైగా ఉదర సమస్యలకే కాకుండా, చర్మ సంరక్షణకు కూడా బాగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి క్యాబేజీని మన ఆహారంలో తరచూ తీసుకోవాలి.
Also Read: గురక సమస్యా ? అయితే ఈ చిట్కాలతో చిటికెలో పరిష్కారం !
నిమ్మ :
నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే, శరీరంలోని వ్యర్థ పదార్ధాలను బయటకు పంపడానికి ఈ నిమ్మకాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి.. కాలేయం శుభ్రం కావడానికి రోజూ పరగడుపున నిమ్మరసం తాగడం మంచిది.
కాలీఫ్లవర్
కాలేయానికి ఈ కాలీఫ్లవర్ వల్ల కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను ఇది పెంచుతుంది. అందువల్ల కాలీఫ్లవర్ గ్యులర్ తీసుకుంటూ ఉండాలి.
అలాగే ఆలివ్ ఆయిల్, యాపిల్, వాల్‌నట్స్ లాంటివి కూడా శరీరంలోని హానికరమైన పదార్థాలను తొలగిస్తాయి.
Also Read: మీ జుట్టు అన్ని సమస్యలు తీరిపోవాలా ? ఇలా చేయండి !