Robots : శక్తివంతమైన మందులు అవసరం లేదు.. జస్ట్ ఈ రోబో ఉంటే చాలు.. పంట చేలో కలుపు మాడిపోతుంది

సాధారణంగా చేను చెలకల్లో కలుపును నివారించాలంటే కూలీలను ఉపయోగిస్తారు. కూలీలు లభించిన పక్షంలో శక్తివంతమైన కలుపు నివారణ మందులు వాడుతారు. అయితే భవిష్యత్తు కాలంలో వీటికి బదులుగా రోబోలను ఉపయోగించే పరిస్థితి రానుంది. ఎందుకంటే అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ యూనివర్సిటీ పరిశోధకులు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 9, 2024 10:27 pm

Robots

Follow us on

Robots :  వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదు. పైగా వెనుకటి రోజుల్లో లాగా నాగళ్ళతో దున్నడం లేదు. అన్నింటికీ ట్రాక్టర్ వినియోగించడంతో సరైన లోతులో దుక్కి కాకపోవడంతో కలుపు సమస్య తీవ్రంగా ఉంటోంది. దీనిని అధిగమించేందుకు రైతులు శక్తివంతమైన మందులు వాడుతున్నారు. దీనివల్ల పంట పొలాలు నాశనమవుతున్నాయి. కలుపు మందును అదేపనిగా పిచికారి చేయడం వల్ల రైతులకు ఉపయోగపడే సహజ పురుగులు చనిపోతున్నాయి. ఇలాంటి సమయంలో పురుగు మందులు వాడకుండా కలుపు సమస్యను నివారించే రోబోలు తెరపైకి వచ్చాయి.

సాధారణంగా చేను చెలకల్లో కలుపును నివారించాలంటే కూలీలను ఉపయోగిస్తారు. కూలీలు లభించిన పక్షంలో శక్తివంతమైన కలుపు నివారణ మందులు వాడుతారు. అయితే భవిష్యత్తు కాలంలో వీటికి బదులుగా రోబోలను ఉపయోగించే పరిస్థితి రానుంది. ఎందుకంటే అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ యూనివర్సిటీ పరిశోధకులు. కలుపు సమస్యను పరిష్కరించేందుకు “రోబో శునకాన్ని” రూపొందించారు. ఈ రోబోలో ఒక గొట్టం వంటి బాగా ఉంటుంది. అది వేడిని వెదజల్లుతుంది. ఆ పరికరం కలుపు మొక్కలను ఇట్టే గుర్తిస్తుంది. ఆ మొక్కల మీద వేడిని ప్రసరింపజేసి.. వాటిని పెరగకుండా రోబో చూస్తుంది. అందువల్లే శక్తివంతమైన కలుపుమందులకు ప్రత్యామ్నాయంగా ఈ రోబో నిలుస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

కలుపు నివారణ మందుల వల్ల..

శక్తివంతమైన కలుపు నివారణ మందుల వల్ల పర్యావరణం పై తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఇవి స్థానికంగా ఉండే జీవుల మనుగడపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇక కొన్ని కలుపు మొక్కలు శక్తివంతమైన మందులను కూడా తట్టుకుంటున్నాయి. తరచూ గ్లై ఫాస్పేట్ వంటి కలుపు నాశకాలకు కూడా కొన్ని కలుపు మొక్కలు లొంగవు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు పరిశోధకులు వినూత్న విధానంలో కలుపు నియంత్రణ వ్యవస్థను ఆవిష్కరించారు. ఈ రోబోలో ప్రొఫెన్ ఆధారిత టార్చ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీని నుంచి కొంత సమయం పాటు వెలువడే వేడి కలుపు మొక్కల ఎదుగుదలను అక్కడికక్కడే నియంత్రిస్తుంది.. అయితే టార్చ్ భాగాన్ని స్పాట్ రోబోకు అమర్చి పరిశోధకులు చూశారు. దానిని పరిశీలించగా వారు ఊహించిన దానికంటే గొప్ప ఫలితాలు వచ్చాయి.

పత్తి పొలంలో పరిశీలించగా..

రోబోను ఒక పత్తి పొలంలో ప్రయోగించారు. అది కలుపు మొక్కలను గుర్తించడంలో 95 శాతం కచ్చితత్వాన్ని ప్రదర్శించింది. కలుపు మొక్కలపై వేడిని వెదజల్లింది. కలుపు మొక్కలను మాడి మసి చేయడానికి బదులుగా, మొక్క మధ్య భాగాన్ని గుర్తించి.. దానిని వేడి చేసింది. ఫలితంగా కొన్ని వారాల వరకు ఆ కలుపు మొక్కల పెరుగుదల ఆగిపోయింది. “రోబో కు అమర్చిన బ్యాటరీ ఈ మొత్తం ప్రయోగంలో పెద్ద సమస్యగా ఉంది. ఒక్కసారి దాన్ని ఛార్జ్ చేస్తే 40 నిమిషాలు మాత్రమే పని చేస్తుంది. ఆ సమయాన్ని పొడిగించడానికి మేము ప్రయోగాలు చేస్తున్నాం. ప్రస్తుతం ఈ రోబో కు 10,000 వోల్ట్ ల కంటే ఎక్కువ మొత్తంలో షాక్ ఇచ్చే పరికరాన్ని కూడా అనుసంధానించాలని భావిస్తున్నాం. దానివల్ల కలుపు మొక్కలను మరింతకాలం పెరగకుండా ఆపడం వీలవుతుందని” పరిశోధకులు చెబుతున్నారు.