Smoking : పొగ తాగడం వల్ల ఇన్ని సమస్యలా? కుటుంబాలు మూల్యం చెల్లించాల్సిందేనా?

Smoking అయినా మీకు, మీ ఫ్యామిలీకి, మీ పక్కన ఉన్న వారికి సమస్యను సృష్టించే ఈ స్మోక్ ను మానేయడం మంచిదే కదా. ఈ సారి అయినా ట్రై చేయండి. అందరి ఆరోగ్యాలను కాపాడండి.

Written By: NARESH, Updated On : July 3, 2024 11:40 am

So many problems due to Smoking

Follow us on

Smoking : పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో చోట్ల రాసి ఉంటుంది. ఎంతో మంది తప్పని చెబుతుంటారు. ఇది పీల్చేవారి కంటే పక్కన ఉన్నవారికి నష్టం ఎక్కువ ఉంటుంది. అయినా సరే బహిరంగ ప్రదేశాలలో పొగ కాలుస్తుంటారు. గుప్పు గుప్పు మంటూ స్టైల్ గా పొగ తాగే వారు కూడా ఉంటారు. వారికి అదొక పిచ్చి కూడా. పిచ్చి పది రకాలు అన్నట్టు ఎంత చెప్పినా వినని వారు కూడా ఉంటారు. అయితే పొగ తాగడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయో తెలిస్తే ఇప్పుడే మానేస్తారు. మరి ఓ సారి లుక్ వేయండి.

ఎలాంటి వ్యాధులు వస్తాయంటే..
పొగతాగడం వల్ల వృద్దాప్య ఛాయలు వస్తాయట. కళ్లను కూడా ఎఫెక్ట్ చేస్తుంది పొగ. దంతాలు ఊడిపోవడం, చిగుళ్లలో బ్లడ్ రావడం, ఉబ్బడం వంటివి జరుగుతాయి. కడుపు క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ వంటి రకరకాల క్యాన్సర్లకు పొగనే కారణం అంటున్నారు నిపుణులు. కళ్ల చూపు మందగించి చివరకు కళ్లు పూర్తిగా కనిపించవట. త్వరగా అలసి పోవడం, బ్రీతింగ్ వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలు కేవలం స్మోకింగ్ చేస్తున్న వారికి మాత్రమే కాదు ఈ పొగ పీల్చుకుంటున్న వారికి కూడా వచ్చే అవకాశం ఉందట.

కుటుంబంలో ఎవరైన స్మోకింగ్ చేస్తే ఇంట్లో వారు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే స్మోక్ మానేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నించండి. ఎన్నో సమస్యలకు కారణం అవుతున్న ఈ స్మోక్ ను బ్యాన్ చేయండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడటానికి ప్రయత్నించండి. మరి ఈ స్మోక్ ను ఎలా మానుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అది కూడా ఓ సారి చూసేద్దాం.

ఎలా మానుకోవాలి:
స్మోకింగ్ మానాలని దృఢంగా నిశ్చయం చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ కూడా చాలా అవసరం. కొందరికి కాఫీ తాగిన వెంటనే స్మోక్ చేయాలి అనిపిస్తుంది. మరికొందరికి డ్రింక్ చేసిన వెంటనే స్మోక్ చేయాలి అనిపిస్తుంది. అందుకే టీ, కాఫీ, డ్రింక్ లను మానేస్తే కూడా స్మోకింగ్ నుంచి దూరం అవచ్చు అంటున్నారు నిపుణులు. అయినా మీకు, మీ ఫ్యామిలీకి, మీ పక్కన ఉన్న వారికి సమస్యను సృష్టించే ఈ స్మోక్ ను మానేయడం మంచిదే కదా. ఈ సారి అయినా ట్రై చేయండి. అందరి ఆరోగ్యాలను కాపాడండి.