Borrow Money : మీ దగ్గర అప్పు తీసుకొని ఇవ్వడం లేదా? అయితే ఇలా చేస్తే వెతుక్కుంటూ వచ్చి ఇస్తారు..

Borrow Money అయితే ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వారు రావాలంటే ఇంట్లో కొన్ని పనులు చేయాలి. ఇలా చేస్తే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుందని జ్యోతిస్య శాస్త్రం తెలుపుతుంది. అదేంటంటే?

Written By: NARESH, Updated On : July 3, 2024 12:33 pm

Do this to those who Borrow Money from you

Follow us on

Borrow Money : డబ్బు మనిషి జీవితాన్ని నడిపిస్తుంది. ఎవరెన్ని చెప్పినా ఇది నిజం. అయితే అందరి వద్ద సరిపోయేంత నగదు ఉండకపోవచ్చు. ఒక్కోసారి కొందరు సముచితంగా ఆదాయం పొందలేకపోతారు. దీంతో ఇతరుల వద్ద అప్పుగా డబ్బును తీసుకుంటారు. అయితే అవసరాల నిమిత్తం దయాగుణులు డబ్బు ఇస్తారు. కానీ తీసుకున్న వారు ఇచ్చిన వారికి అనుకున్న సమయానికి ఇచ్చిన వారు కొందరే. దీంతో అప్పు ఇచ్చిన వారు తీవ్ర మనోవేదనకు గురవుతాయి. నిజ అవసరాల కోసం డబ్బు అడిగినా కొందరు ఇలాంటి వారు ఇవ్వడానికి వెనుకాడుతారు. అయితే ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వారు రావాలంటే ఇంట్లో కొన్ని పనులు చేయాలి. ఇలా చేస్తే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుందని జ్యోతిస్య శాస్త్రం తెలుపుతుంది. అదేంటంటే?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనుషులు ఎదుర్కొంటున్న కొన్ని కష్టాలను దైవ చింతనతో తొలగించుకోవచ్చు. అయితే ఇలా చేయాలంటే కాస్త ఓపిక, సహనం, ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండాలి. దైవం మీద నమ్మకం ఉన్న వారు మాత్రమే ఇలాంటి పనులు చేయాలి. అలాగని ఏదో అసవరాలకు పూజలు చేసి, ఆ తరువాత పట్టించుకోకపోయినా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. ప్రస్తుతం కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య రానీ బాకీలు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ చిన్న పనిచేయాలి.

మనం ఇతరులకు ఇచ్చిన అప్పును తిరిగి రప్పించే శక్తి ఒక్క హనుమంతుడికే ఉందని కొందరు పండితులు చెబుతున్నారు. ఆంజనేయుడిని నమ్ముకొని ఏ పనిచేసినా అది సక్సెస్ అవుతుంది. అయితే హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం రోజున సాయంత్రం ప్రత్యేకంగా దీపం వెలిగించాలి. ఈ దీపం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రానీ బాకీలు వసూలవుతాయి. అయితే ఈ దీపం ఎలా పెట్టాలంటే?

ప్రతీ మంగళవారం సాయంత్ర ఒక దీపాన్ని వెలిగించాలి. ఒక కర్పూరం బిళ్ల, రెండు లవంగాలు దీపం వద్ద ఉంచాలి. వీటికి ఉన్న పవర్ ద్వారా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయిన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ ఎనర్జీ వల్ల ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా.. వాటి నుంచి బయటపడుతారు.