Jobs: యూరప్‌లో ఉద్యోగాలు.. హైదరాబాద్‌ లో రిక్రూట్‌మెంట్‌

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ బీ1 భాషా శిక్షణను భారత దేశంలో పూర్తి చేసిన తర్వాత జర్మనీలో నర్సింగ్‌ సహాయకులుగా పని చేయవచ్చు.

Written By: Raj Shekar, Updated On : July 3, 2024 11:39 am

Jobs

Follow us on

Jobs: తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌(టామ్‌ కామ్‌) యూరప్‌లో ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాద్‌లోని అభ్యర్థులను రిక్రూట్‌ చేస్తోంది. టామ్‌కామ్, జర్మనీ ప్రభుత్వం ఫెడరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఏజెన్సీ మధ్య కొనసాగుతున్న ’ట్రిపుల్‌ విన్‌ పర్టనర్‌షిప్‌’లో భాగంగా జర్మనీలో రిక్రూట్‌ అయ్యే నర్సుల కోసం జర్మన్‌ భాషా శిక్షణ కోసం ప్రత్యేక స్క్రీనింగ్, ఎన్‌రోల్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఉద్యోగాలకు అర్హత సాధించడానికి అభ్యర్థులు ఈ ప్రమాణాలు ఉండాలి.

అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు..

1. తెలంగాణ గుర్తింపు పొందిన కళాశాలల నుంచి జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌ ఉండాలి.

2. అభ్యర్థుల వయసు 21–38 సంవత్సరాల మధ్య ఉండాలి.

3. అభ్యర్థులకు 1 నుంచి 3 ఏళ్ల వృత్తి/క్లినికల్‌ అనుభవం ఉండాలి.

4. జర్మన్‌ భాషా నైపుణ్యం ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక తర్వాత..
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ బీ1 భాషా శిక్షణను భారత దేశంలో పూర్తి చేసిన తర్వాత జర్మనీలో నర్సింగ్‌ సహాయకులుగా పని చేయవచ్చు. భాషా శిక్షణ ఉచితంగా ఇస్తారు. జర్మన్‌ భాషా పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత స్టైఫండ్‌ కూడా ఇస్తారు. జర్మనీలో బీ2, గుర్తింపు పరీక్షలను క్లియర్‌ చేసిన తర్వాత వారు రిజిస్టర్డ్‌ నర్సులుగా పదోన్నతి పొందుతారు.

వేతనాలు ఇవీ..
ఇక ఐరోపాలో ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి కనీస వేతనం 2,300 యూరోల నుంచి 2,800 యూరోల వరకు ఉంటుంది. ఓవర్‌టైమ్‌ అలవెన్సులు చెల్లిస్తారు. అదనంగా, అన్ని వీసా, ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియలు, వన్‌–వే విమాన టిక్కెట్లు టామ్‌ కమ్, జర్మన్‌ భాగస్వామ్యం ద్వారా ఉచితంగా అందిస్తారు.

ఇలా సంప్రదించాలి..
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 6302292450, 9908830438, లేదా 8499990304 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలి. లేదా జూలై 9 నుంచి 17 వరకు బేగంపేటలోని ప్లాజా హోటల్‌లోని 2వ అంతస్తులో నేరుగా సంప్రదించవచ్చు. అదనపు సమాచారం కోసం, టామ్‌కామ్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.

టామ్‌ కామ్‌ గురించి..
ఇక ఈ రిక్రూట్‌మెంట్‌ చేపట్టిన టామ్‌ కామ్‌ తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ కింద రిజిస్టర్డ్‌ అయిన రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ. తెలంగాణ నుంచి అర్హత కలిగిన నైపుణ్యం కలిగిన, సెమీ–స్కిల్డ్‌ కార్మికులకు విదేశీ నియామకాలను ఇది చేపడుతుంది. తెలంగాణ అభ్యర్థులకు విదేశాల్లో ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆస్ట్రేలియా, కెనడా, యూరప్‌లోని జర్మనీ, హంగేరీ, జపాన్, పోలాండ్, రొమేనియా, బ్రిటన్, గల్ఫ్‌ వంటి దేశాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ రిజిస్టర్డ్‌ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంది.