Sleep: నేలపై నిద్రిస్తున్నారా? జరిగేది ఇదే..

ప్రస్తుతం కాలంలో సాప్ట్ వేర్ జాబ్ చేసేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. అంటే కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శారీరక అలసట ఉండదు. దీంతో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు.

Written By: Chai Muchhata, Updated On : August 24, 2024 8:29 am

Sleep

Follow us on

Sleep: మనిషికి నిద్ర వరం లాంటిది. ప్రతిరోజూ నిద్రించడం వల్ల మనిషికి ఎంతో హాయిగా ఉంటుంది. ఆరోజు పడిన కష్టమంతా ఒక్క నిద్రతో మరిచిపోతూ ఉంటారు. అందుకే నిద్ర కోసం కొందరు ప్రత్యేక ప్రణాళికలు వేసుకుంటారు. వైద్యులు చెప్పిన ప్రకారం.. ప్రతి మనిషి 6 గంటలు నిద్రించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. అదే సమయంలో ఆరోగ్యంగానూ ఉండగలుగుతారు అయితే ఈ 6 గంటలు సుఖ నిద్ర ఉంటేనే ఆరోగ్యం అని వైద్యలు చెబుతున్నారు. ఎందుకంటే చాలా మంది 6 కంటే ఎక్కువ గంటలు నిద్రపోయినా కలతతో ఉంటారు. దీంతో మనస్పూర్తిగా నిద్రపోనట్లే లెక్క. ఈ నేపథ్యంలో సుఖ నిద్ర కోసం కొందరు బెడ్ మంచాలపై మాట్రీస్ వేసి నిద్రిస్తుంటారు. కానీ మాట్రీస్ కంటే నేలపై నిద్రించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేలపై నిద్రించడ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం.

ప్రస్తుతం కాలంలో సాప్ట్ వేర్ జాబ్ చేసేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. అంటే కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శారీరక అలసట ఉండదు. దీంతో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. అయితే ఇలా ఎక్కువ సేపు కూర్చొని పని చేసేవాళ్లు నేలపై నిద్రించాలి. దీంతో వీరి కండరాల్లో కదలిక ఏర్పడి రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఏదో ఒక అనారోగ్యానికి గురవుతున్నారు. వీరిలో వెన్ను నొప్పితో ఎక్కువగా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వెన్ను నొప్పితో బాధపడేవారు నేలపై నిద్రించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. బీపీతో బాధపడేవారు ఇప్పుడున్న వారిలో ఎక్కువ మందే ఉన్నారు. అయితే బీపీ ఎక్కువగా ఉన్న వారు నేలపై నిద్రించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

ఒత్తిడి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై పోయింది. విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారం చేసేవారికి వరకు ఏదో రకంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి ఏవేవో వ్యసనాల బారిన పడుతున్నారు. అయితే ప్రతిరోజూ నేలపై నిద్రించడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. నేలపై నిద్రిండం వల్ల శరీరంలోని అన్నీ అవయవాల్లో కదలికలు ఉంటాయి. దీంతో హాయి నిద్ర ఉంటుంది.

పలు రకాల ఒత్తిడి వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే మాట్రీస్ పై నిద్రించడం వల్ల కొందరిని ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. అదే నేలపై నిద్రించడం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు. నేల ప్లాట్ గా ఉండడం వల్ల కండరాల్లో కదలిక ఏర్పడుతుంది.

పూర్వాకాలంలో అందరూ నేలపై నిద్రించేవారు. దీంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరూ మాట్రీస్ పై నిద్రిస్తున్నారు. మాట్రీస్ పై నిద్రించడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీంతో మెదడుపై ప్రభావం పడి కలత నిద్రతో ఉంటారు. అందువల్ల సాధ్యమైనంత వరకు నేలపై నిద్రించడానికి ప్రయత్నించాలి. అయితే ప్రతిరోజూ వీలు కాకపోయినా వారంలో కొన్ని సార్లు అయినా నేలపై నిద్రించడం అలవాటు చేసుకోవాలి.