Aloe Vera: ముఖ సౌందర్యం కోసం ప్రజలు చాలా కష్టాలు పడుతుంటారు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బ్యూటీ పార్లర్ నుంచి నార్మల్ ప్రొడక్టుల వరకు అన్ని ఉపయోగిస్తుంటారు. ఎన్ని ప్రోడక్టులు ఉపయోగించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అప్పుడు నిరాశ చెందుతారు. ఆ తర్వాత ఇంట్లో ఉండే పదార్థాలతో ముఖ సౌందర్యాన్ని పెంచుకునే పనిలో పడతారు. ఇందులో భాగంగా పసుపు, టమాటా, కాఫీ, అలోవెరా వంటివి వినియోగిస్తుంటారు. మరి వీటిని వినియోగించడం వల్ల చాలా మందిలో ప్రయోజనాలు కనిపిస్తాయి కానీ కచ్చితంగా సరైన విధానంలోనే ఉపయోగించాలట. లేదంటే సమస్యలు వస్తాయి. తెలియకుండా చేసే కొన్ని తప్పులు మీ ముఖ సౌందర్యాన్ని నాశనం చేస్తాయి. అయితే మీరు అలోవెరాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ రాత్రి కూడా దీన్ని పెట్టుకొని మరీ పడుకుంటున్నారా? అయితే ఇలా పెట్టుకొని పడుకోవడం వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేదంటే పర్వాలేదా? టెన్షన్ ఎందుకు ఓ సారి తెలుసుకోండి.
కొందరు రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్‌ని ముఖానికి రాసుకుంటారు. రాత్రంతా ఈ జెల్ ను ముఖానికి రాసుకుని నిద్రిస్తుంటారు. మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు కలబంద జెల్‌ను అప్లై చేస్తే, అది మీ చర్మానికి మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయం చేస్తుందట. అంతేకాదు అలోవెరా జెల్ ముడుతలను తగ్గిస్తుంది . మొటిమలను తొలగిస్తుంది. స్కిన్ ను మెరిసేలా చేస్తుంది. రాత్రిపూట అలోవెరా జెల్‌ను ముఖంపై అప్లై చేసే ముందు, ప్యాచ్ టెస్ట్ చేసి వినియోగించండి. ఎందుకంటే కొందరికి అలోవెరా జెల్ వల్ల అలర్జీ వంటి సమస్యలు వస్తుంటాయి. మీరు మీ ముఖంపై ఏదైనా ఉత్పత్తిని ఉపయోగిస్తుంటే మాత్రం కచ్చితంగా అలోవెరా జెల్‌ను ముఖంపై పూయడం మానుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల సమస్య పెరుగుతుందట.
అలోవెరా జెల్ ను రెగ్యులర్ ఉపయోగించడం వల్ల రోజంతా చర్మ కణాలను లోతుగా హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. ఇది సన్‌బర్న్ , డార్క్ స్పాట్‌లను తగ్గిస్తుంది. అంతేకాదు గాయం కూడా తేలికగా మారుతుంది. అలో వెరా జెల్ ముఖ వాపును తగ్గించి అందంగా మారుస్తుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. కొందరిలో వయసు పెరుగుతుంటే చర్మం వదులుగా , ముడతలు పడటం ప్రారంభం అవుతుంటుంది. ఇది చర్మ కణాలలో తేమ లోపానికి దారితీస్తుంది. ఇలాంటి సమస్య నుంచి కూడా పరిష్కారం అందిస్తుంది అలోవెరా జెల్.
మలినాలను తొలగించడానికి, చనిపోయిన చర్మ కణాలను తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఎందుకంటే ఇందులో అవసరమైన విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మ రంధ్రాలను కూడా క్లీన్ చేస్తుంది. మృత చర్మ కణాలు, కాలుష్య కారకాలు , అదనపు నూనెను తొలగించడంలో సహాయం చేస్తుంది. తద్వారా చర్మం శుభ్రం అవుతుంది. అంటే ఆటోమేటిక్ గా మొటిమలు, మచ్చలు , బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. చర్మ రంధ్రాలను కూడా బిగుతుగా చేస్తుంది ఈ అలోవెరా జెల్.