Homeబిజినెస్Cloud Observer Job : మేఘాలను వీడియో తీస్తే రూ. 8.5 లక్షల జీతం..

Cloud Observer Job : మేఘాలను వీడియో తీస్తే రూ. 8.5 లక్షల జీతం..

Cloud Observer Job : ఇప్పటివరకు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారికి లక్షల్లో జీతం వస్తుందని విన్నాం.. అలాగే వ్యాపారస్తులకు కూడా కోట్లలో ఆదాయం వస్తుందని తెలుసుకున్నాం.. కానీ చేతిలో కెమెరా ఉండి.. కొండపై కూర్చొని మేఘాలను వీడియో తీస్తే నెలకు రూ. 8.5 లక్షల జీతం ఇస్తున్నారంటే ఎవరైనా ఊరుకుంటారా? వెంటనే దరఖాస్తు చేసుకుంటారు. అలా ఈ జాబ్ కు 3500 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఒక వ్యక్తి ఈ ఉద్యోగానికి అర్హుడయ్యాడు. ఇంతకీ […]

Cloud Observer Job : ఇప్పటివరకు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారికి లక్షల్లో జీతం వస్తుందని విన్నాం.. అలాగే వ్యాపారస్తులకు కూడా కోట్లలో ఆదాయం వస్తుందని తెలుసుకున్నాం.. కానీ చేతిలో కెమెరా ఉండి.. కొండపై కూర్చొని మేఘాలను వీడియో తీస్తే నెలకు రూ. 8.5 లక్షల జీతం ఇస్తున్నారంటే ఎవరైనా ఊరుకుంటారా? వెంటనే దరఖాస్తు చేసుకుంటారు. అలా ఈ జాబ్ కు 3500 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఒక వ్యక్తి ఈ ఉద్యోగానికి అర్హుడయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఇంత జీతం ఎవరిస్తున్నారు?

చైనా దేశంలోని హెనాన్ ప్రావిన్స్ లో ఉన్న లావోజున్ మౌంటెన్ సీనిక్ ప్రాంతంలో ఓ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ‘సి ఆఫ్ క్లౌడ్స్ అబ్జర్వర్’ , ‘క్లౌడ్ స్కేప్ అబ్జర్వర్’ అని పిలిచే ఈ పోస్ట్ కోసం కొంతమంది నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ పోస్టులో భాగంగా ఉద్యోగానికి ఎంపికైన వారు 30 రోజులపాటు పర్వత శిఖరాలపై నివసించాలి. అక్కడి మేఘాలను, వాటిలో వచ్చే మార్పులను ప్రతిరోజు వీడియోలు తీస్తూ. ఫోటోల రూపంలో చిత్రీకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పని చేసే వారికి వసతి ఉచితంగానే కల్పించనున్నారు.

ఈ జాబ్ ఆఫర్ రాగానే 3500 మంది వ్యక్తులు దరఖాస్తు చేసుకున్నారు. తమ అర్హతలను తెలియజేయడానికి అప్పటికే మేఘాలకు సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ వీడియోలకు ఎక్కువగా లైక్స్ లేదా ఆదరణ లభిస్తుందో వారిని ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా 23 ఏళ్ల లి సించెన్ అనే కుర్రాడికి ఈ అవకాశం దక్కింది. ఆయన చేసిన వీడియోకు భారీగా స్పందన లభించింది. దాదాపు ఈ వీడియోకు 80 వేలకు పైగా లైక్స్ రావడంతో ఎంపికలో ఆయన ముందంజలో నిలిచారు.

ఈ ఉద్యోగం చూడడానికి చాలా ఈజీగా అనిపించినా.. నేరుగా వెళ్లి చూస్తే ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఎంపికైన సించెన్ తన అనుభవాలను పంచుకున్నాడు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచి సూర్యోదయంలో మేఘాల కదలికకు సంబంధించిన వీడియోలను తీయాలని.. ఆ తర్వాత ప్రకృతి దృశ్యాలను చిత్రీకరించాలని.. సాయంత్రం సూర్యాస్తమం అయ్యేవరకు వీడియోలు తీస్తూనే ఉండాలని ఆయన తెలిపారు.

అయితే కేవలం మేఘాలను వీడియో తీయడమే కాకుండా ప్రతిరోజు ఒక షార్ట్ వీడియోను తయారుచేసి సోషల్ మీడియాలో ప్రచురించాల్సి ఉంటుంది. ఇక్కడ కూర్చొని అందమైన దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పర్యాటకులను ఆకర్షించడానికి ఇక్కడున్న వాతావరణం తెలియజేయడానికి ఈ ఉద్యోగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నెల రోజులపాటు ఉద్యోగం చేసిన సించెన్ కు 60 వేల యువాన్ల జీతం అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 8.5 లక్షల మొత్తం రానుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper