Eating Breakfast : బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో చిక్కినట్లే!

ఉదయం పూట అల్పహారం తినకపోతే శరీరం అలసటకు గురవుతుంది. దీంతో రోజంతా నీరసంగా ఉంటారు. సరిగ్గా పనిచేయలేరు. బాడీ యాక్టివ్ లేకపోతే పనిపై అంత ఆసక్తి కూడా ఉండదు. కొన్ని రోజులకు రక్తహీనత ఎక్కువ అవుతుంది. అలాగే చిరాకు పెరుగుతుంది. దీంతో మానసిక సమస్యలు వస్తాయి.

Written By: Gopi, Updated On : August 19, 2024 4:42 pm

Don't Skip Breakfast

Follow us on

Eating Breakfast : మారిన జీవనశైలి కారణంగా చాలామంది లేటుగా నిద్రలేస్తున్నారు. దీంతో ఉదయాన్నే టిఫన్ చేసే అలవాటు కూడా మర్చిపోతున్నారు. కొందరైతే పొద్దున్న ఆఫీస్‌కి లేదా స్కూల్, కాలేజీకి ఆలస్యం అవుతుంది ఏమో అని భయంతో బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారు. ఒక్కపూట తినకపోతే ఏమవుతుందలే అని తినడం మానేస్తున్నారు. చాలామంది బరువు తగ్గాలని తిండిని తగ్గిస్తున్నారు. ఈరోజుల్లో ఎక్కువమంది నైట్‌షిఫ్ట్‌లు చేస్తున్నారు. పొద్దున్నే నిద్రపోతున్నారు. కానీ బ్రేక్‌ఫాస్ట్‌ను ష్కిప్ చేస్తున్నారు. దీనివల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.

ఉదయం పూట అల్పహారం తినకపోతే శరీరం అలసటకు గురవుతుంది. దీంతో రోజంతా నీరసంగా ఉంటారు. సరిగ్గా పనిచేయలేరు. బాడీ యాక్టివ్ లేకపోతే పనిపై అంత ఆసక్తి కూడా ఉండదు. కొన్ని రోజులకు రక్తహీనత ఎక్కువ అవుతుంది. అలాగే చిరాకు పెరుగుతుంది. దీంతో మానసిక సమస్యలు వస్తాయి. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగ్గా అందవు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి నుంచి పొద్దున్న వరకు నిద్రపోవడం వల్ల ఎక్కువ సమయం కడుపు ఖాళీగా ఉంటుంది. పొద్దున్న కూడా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే జీవక్రియ మీద ప్రభావం చూపుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి ఎంత బిజీగా ఉన్నాసరే బ్రేక్‌ఫాస్ట్ అయితే మానవద్దు.

శరీరానికి కావల్సిన పోషకాలు అన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఉదయం తినాలి. రైస్ తినలేని వాళ్లు ఏదో ఒకటి తప్పకుండా తినాలి. సాధారణంగా చాలామంది బ్రేక్‌ఫాస్ట్ తక్కువగా తిని.. రాత్రిపూట ఎక్కువగా తింటారు. కానీ రాత్రిపూట తక్కువగా తిని బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తినాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అందుతాయి. శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనేది తప్పనిసరి. పిల్లలకు అయితే బ్రేక్‌ఫాస్ట్ అసలు స్కిప్ చేయకూడదు. వాళ్లు తొందరగా పెరగాలన్నా.. వాళ్ల మెదడు చురుకుగా పనిచేయాలన్నా ఉదయం పూట తప్పకుండా తినాలి.

సాధారణంగా నాలుగు గంటల్లో మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది. కాబట్టి రోజులో నాలుగు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలి. లేకపోతే కనీసం 6 గంటలకు ఒకసారి అయిన తినాలి. లేకపోతే నీరసంగా ఉంటారు. ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే కడుపులో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలి కదా అని లేచిన 5 గంటల తర్వాత లేదా పది గంటల తర్వాత చేయడం కాదు. నిద్ర లేచిన గంట తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో ఓట్స్, మొలకెత్తిన గింజలు, గుడ్లు, పండ్లు వంటివి తీసుకోవచ్చు. ఎక్కువ పోషకాలు ఉండేవి తీసుకుంటే బలంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. కాబట్టి శరీరానికి బలాన్ని చేకూర్చే వాటిని మాత్రమే ఉదయం పూట తినడం అలవాటు చేసుకోండి.