https://oktelugu.com/

Job after degree : డిగ్రీ తర్వాత ఉద్యోగం దొరకడం లేదా.. అయితే మీరు ముందు చేయాల్సింది ఇది!

డిగ్రీ మొదటి సంవత్సరంలోనే కెరీర్ గురించి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే డిగ్రీ పూర్తయిన వెంటనే ఏదో ఒక ఉద్యోగంలో చేరవచ్చు. చాలామంది డిగ్రీ చదువుతూ టైం వేస్ట్ చేస్తుంటారు. అలా కాకుండా డిగ్రీ తర్వాత ఎటు వెళ్లాలని ఒక నిర్ణయానికి ముందే రావాలి. డిగ్రీ తర్వాత పీజీ, సాఫ్ట్‌వేర్, డిజిటల్ మార్కెటింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా వంటివి చాలా ఉన్నాయి

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 20, 2024 / 04:23 AM IST

    Job after degree

    Follow us on

    Job after degree : ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హత కావాలంటే తప్పనిసరిగా డిగ్రీ ఉండాలి. అయితే డిగ్రీ అయిన వెంటనే ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ కావచ్చనే ఉద్దేశంతో డిగ్రీ చదువుతారు. కానీ డిగ్రీ పూర్తిచేసిన వాళ్లతో పోలిస్తే ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎంతో మంది ఉద్యోగాలు లేక ఖాళీగా తిరుగుతున్నారు. డిగ్రీ వరకు మంచిగా సాగిన కెరీర్ ఒక్కసారిగా అక్కడితో ఆగిపోతుంది. డిగ్రీ తర్వాత ఉద్యోగాలు అంతగా దొరక్కపోవడంతో కొందరు ఖాళీగా ఉంటున్నారు. మరికొందరు ఉన్నత చదువులు చదువుతున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? డిగ్రీ తర్వాత ఎందుకు చాలామంది ఖాళీగా ఉంటున్నారు. ఉద్యోగం దొరక్కపోతే ఏం చేయాలో తెలుసుకుందాం.

    డిగ్రీ మొదటి సంవత్సరంలోనే కెరీర్ గురించి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే డిగ్రీ పూర్తయిన వెంటనే ఏదో ఒక ఉద్యోగంలో చేరవచ్చు. చాలామంది డిగ్రీ చదువుతూ టైం వేస్ట్ చేస్తుంటారు. అలా కాకుండా డిగ్రీ తర్వాత ఎటు వెళ్లాలని ఒక నిర్ణయానికి ముందే రావాలి. డిగ్రీ తర్వాత పీజీ, సాఫ్ట్‌వేర్, డిజిటల్ మార్కెటింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా వంటివి చాలా ఉన్నాయి. అందులో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అటు వైపు వెళ్లవచ్చు. లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. ఈమధ్య చాలామంది డిగ్రీ తర్వాత సాఫ్ట్‌వేర్ వైపు వెళ్తున్నారు. అటు సైడ్ వెళ్లాలనుకుంటే ముందు నుంచే కోర్సులు నేర్చుకోవడం మంచిది. లాంగ్వేజ్‌లు, ఐటీ కోర్సులు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో నేర్చుకుంటే డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరవచ్చు. మీ చదువుకునే కాలేజీలో ప్లేస్‌మెంట్స్ ఉంటే మీ స్కిల్స్ బట్టి అందులోనే మీకు ఉద్యోగం వస్తుంది.

    ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పట్టు ఉంటే ముందు నుంచే ప్రణాళిక ఉండాలి. డిగ్రీ ఒక పక్క చదువుతూ ప్రభుత్వ ఉద్యోగాలకు చదవాలి. ఎందుకంటే వీటిలో ఉండే పోస్ట్‌లు, రిజర్వేషన్లు, మెరిట్ ఆధారంగా ఉద్యోగం వస్తుంది. కొన్నిసార్లు ఒక్కమార్కులో కూడా ఉద్యోగం పోవచ్చు. యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీ వంటి వాటిలో ఉద్యోగం సాధించాలంటే ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే సిలబస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి ప్లాన్ సరిగ్గా ఉండాలి. డిగ్రీ చదువుతూ వీటికి చదవాలి. డిగ్రీ పూర్తయ్యే సరికి వీటిపై మీకు కొంత అవగాహన వస్తుంది. దీంతో వెంటనే మీరు ఉద్యోగం సాధించవచ్చు. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది. కానీ బ్యాంకు ఉద్యోగాలు ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చదవడం ఒక ఎత్తు అయితే డిగ్రీ తర్వాత ప్రిపరేషన్ ఒక ఎత్తు. మీరు ఎంత హార్డ్‌వర్క్ చేస్తారో అలాగే స్మార్ట్‌వర్క్ కూడా చేయాలి. ఏ పరీక్ష రాస్తున్నారో దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లానింగ్ ముందే చేసుకోవాలి. అప్పుడే మీరు పరీక్ష సమయానికి సిలబస్ అంతా పూర్తి చేయగలరు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ముఖ్యంగా అర్థమెటిక్, రీజనింగ్ వంటివి నేర్చుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేసి వీటిపై పట్టు సాధించాలి. అప్పుడే డిగ్రీ పూర్తయిన వెంటనే మీరు ఏదో ఒక కొలువు సాధించవచ్చు.