https://oktelugu.com/

overconfidence : అతి విశ్వాసం కూడా డేంజర్.. మీరు ఇలా మారాల్సిన అవసరం ఉంది

చాలామంది విషయాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా వ్యక్తిగతంగా వాళ్లు తీర్పు నిచ్చుకుంటారు. ఒక విషయం కుదరదు అని తెలిసిన కూడా అవుతుందని పట్టు పడతారు. ఎవరు ఎన్ని చెప్పిన వినకుండా వాళ్ల అనుకున్నదే కరెక్ట్ అనే భావనలో ఉంటారు. ఏదైనా విషయాన్ని లేదా మనుషులన్ని అయిన అతిగా నమ్ముతుంటారు. ఇలా మీతిమీరిన విశ్వాసం చాలా ప్రమాదకరం.

Written By:
  • Srinivas
  • , Updated On : August 20, 2024 / 02:14 AM IST

    Overconfidence

    Follow us on

    overconfidence : జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆత్మ విశ్వాసంతో ముందుకు పోవాలని చాలామంది చెబుతుంటారు. ఆత్మ విశ్వాసం ఉంటే ఎలాంటి సమస్యలని అయిన పరిష్కరించగలరని అంటుంటారు. తనపై తనకు నమ్మకం లేని మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు. భయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల చాలామంది జీవితంలో వాళ్లు కావాలనున్నవి సాధించలేకపోయారు. అయితే ఏదైనా లిమిట్‌గా ఉంటేనే మంచిది. మనకి ఎంత కావాలో అంతే ఉండాలి. లేకపోతే ప్రమాదమే. అలాగే ఆత్మవిశ్వాసం కూడా కొంతవరకు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉన్నా కూడా డేంజర్‌. అతి విశ్వాసం వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మరి అతి విశ్వాసం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.

    చాలామంది విషయాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా వ్యక్తిగతంగా వాళ్లు తీర్పు నిచ్చుకుంటారు. ఒక విషయం కుదరదు అని తెలిసిన కూడా అవుతుందని పట్టు పడతారు. ఎవరు ఎన్ని చెప్పిన వినకుండా వాళ్ల అనుకున్నదే కరెక్ట్ అనే భావనలో ఉంటారు. ఏదైనా విషయాన్ని లేదా మనుషులన్ని అయిన అతిగా నమ్ముతుంటారు. ఇలా మీతిమీరిన విశ్వాసం చాలా ప్రమాదకరం. అతి విశ్వాసం అనేది చివరకు మేనియాకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేనియా వల్ల వాళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తారు. కేవలం అది భావన మాత్రమే. కానీ వాళ్లు మానసికంగా, శారీరంగా ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మేనియాతో ఇబ్బంది పడుతున్నవాళ్లు దేని గురించి సరిగ్గా ఆలోచించలేరు. వాళ్లు తీసుకునే నిర్ణయాలు కూడా మారిపోతుంటాయి. అలాగే ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడం, తాగడం, సరిగ్గా తినకపోవడం, విపరీతమైన కోపం వంటివి చేస్తుంటారు. అలాగే వాళ్ల ఆలోచన శక్తి కూడా పరిధులు దాటుతుంది.

    ఏ విషయాన్ని అయిన ఎక్కువగా ఆలోచిస్తారు. ఎక్కువ ఆనందం వచ్చినా, బాధ వచ్చిన తట్టుకోలేరు. చిన్న విషయాలకి చిరాకు పడటం, కోపగించుకోవడం వంటివి చేస్తుంటారు. అసలు పూర్తిగా నిద్రపోరు. తిండిపై అయితే వీళ్లకి దృష్టి ఉండదు. తినకపోయిన ఎన్నిరోజులు అయిన ఉండగలరు. ఏది అయిన చేసేస్తామనే భావనలో ఉంటారు. ఉదాహరణకు నేను కంపెనీ పెడతా.. కోట్లు సంపాదిస్తా అని ఆనందంతో ఉప్పెంగిపోతుంటారు. అంటే జరగకుండానే జరిగిపోతుందని తెగ సంబరపడిపోతుంటారు. అయితే ఇది ఎక్కువగా ఒత్తిడి లేదా జన్యు కారణాల వల్ల వస్తుందని నిపుణులు అంటున్నారు. ఆందోళన, డిప్రెషన్, ఇంతకు ముందు ఏవైనా మందులు వాడటం వల్ల వాటి ఎఫెక్ట్స్ వల్ల  కూడా కొన్నిసార్లు వస్తుంది. అయితే ఇందులో హైపో మేనియా, బైపోలార్ డిజార్డర్ అనే రెండు రకాలు ఉంటాయి. మీరు లక్షణాలు ఏవైనా కనిపిస్తే దాన్ని బట్టి వైద్యులు చికిత్స చేస్తారు. అయితే బైపోలార్ డిజార్డర్ అనేది ఎక్కువగా మహిళల కంటే పురుషుల్లో కనిపిస్తుంది. వీటికి చికిత్సగా మందులు తీసుకోవాలి. వీటి కంటే కౌన్సిలింగ్‌తో మేనియాకు నయం చేయవచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. మందులు వాడుతుండాలి. అప్పుడే సమస్యను తగ్గించవచ్చు. ఆత్మ విశ్వాసం మంచిదే. కానీ అది అతిగా మారకూడదు. అతి విశ్వాసం ఎప్పటికైనా.. మానసికంగా ఇబ్బంది పెడుతుంది.