https://oktelugu.com/

Health Tips : ఎక్కువ గంటలు పనిచేస్తే.. అనారోగ్య సమస్యలు తప్పవా.. సర్వే ఏం చెబుతుందంటే?

కొన్ని సంస్థల అధ్యయనాల ప్రకారం వారానికి లిమిట్ దాటి పనిచేయకూడదు. అంటే వారానికి 55 నుంచి 60 గంటల కంటే ఎక్కువగా పనిచేస్తే మాత్రం తప్పకుండా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఆరోగ్యంగానే ఉన్నారని అనుకుంటారు. కానీ మానసికంగా కుంగిపోతారని సర్వే తెలిపింది. మానవుడి మెదడు, మనస్సుపై అధ్యయనం చేశారు. ఎవరైతే రోజుకి 12 గంటలు కంటే ఎక్కువగా వర్క్ చేస్తారో వారి మానసిక స్థితి తప్పకుండా దెబ్బతింటుంది.

Written By: , Updated On : February 3, 2025 / 11:38 AM IST
Sitting in one place for hours

Sitting in one place for hours

Follow us on

Health Tips :  సాధారణంగా ప్రతీ ఆఫీస్ 8 లేదా 9 గంటల సమయం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయాలనే దానిపైన చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఆర్థిక సర్వే కీలక వివరాలు తెలిపింది. నిజానికి రోజుకి 8 లేదా 9 గంటలు డ్యూటీ చేయడం వల్ల అలసట, నిరాశకు గురవుతారు. దీంతో ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయతే వారానికి 60 గంటల కంటే ఎక్కువ గంటలు పని చేయాలని అంటున్నారు. అంటే రోజుకి ఆఫీసులో దాదాపుగా 12 గంటల పాటు వర్క్ చేయాలని కొందరు చెబుతున్నారు. కానీ ఇలా ఎక్కువ సమయం ఆఫీసులో వర్క్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని సర్వే చెబుతోంది. పని అనేది కొన్ని గంటలు మాత్రమే చేయాలి. ఎక్కువగా పని చేస్తే రిజల్ట్ బాగుంటుందని కంపెనీలు చెబుతాయి. కానీ ఎక్కువగా పని చేయడం వల్ల తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఒకే ప్లేస్‌లో గంటల తరబడి కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. బాడీకి కాస్త ఫ్రీ ఉండాలి. అప్పుడే వర్క్ కూడా సరిగ్గా చేయగలరు.

కొన్ని సంస్థల అధ్యయనాల ప్రకారం వారానికి లిమిట్ దాటి పనిచేయకూడదు. అంటే వారానికి 55 నుంచి 60 గంటల కంటే ఎక్కువగా పనిచేస్తే మాత్రం తప్పకుండా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఆరోగ్యంగానే ఉన్నారని అనుకుంటారు. కానీ మానసికంగా కుంగిపోతారని సర్వే తెలిపింది. మానవుడి మెదడు, మనస్సుపై అధ్యయనం చేశారు. ఎవరైతే రోజుకి 12 గంటలు కంటే ఎక్కువగా వర్క్ చేస్తారో వారి మానసిక స్థితి తప్పకుండా దెబ్బతింటుంది. అలాగే ఇతరులతో మంచిగా ఉండలేరు. అంటే ఆఫీసులో లేదా బయట బంధువులతో అయినా కూడా చీటికి మాటికి గొడవలు పడుతుంటారు. వర్క్ మీద డెడికేషన్ ఉండి చేయాలి. కానీ మరీ ఎక్కువ గంటలు పనిచేస్తే మాత్రం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటం కూడా పక్కా అంటున్నారు. అయితే వీరు నెలకు రెండు లేదా మూడు రోజులు అయినా బయటకు వెళ్లడం, కుటుంబ సభ్యులతో గడపడం వంటివి చేయడం వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు ఉండే ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే మానసిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వారానికి 90 గంటలు పనిచేయాలనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ గంటలు వర్క్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ కూడా పెరగదు. ఉద్యోగం మీద విరక్తి వస్తుందని కొందరు అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎక్కువ గంటలు పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు.