Luxury cars
Luxury cars : ఈ ప్రపంచంలో ఖరీదైనవి.. తక్కువ రేటువి కూడా ఉన్నాయి. ప్రతీ వస్తువుకి కూడా క్వాలిటీ, ధర అన్ని ఉంటాయి. అయితే ఈ ప్రపంచంలో ఒక్కోరి స్తోమతను బట్టి వస్తువులను వాడుతుంటారు. వారికి ఎంత ధరలో వీలైతే అంత ధరలో వాడుతుంటారు. అయితే మనలో చాలా మందికి కార్లు అంటే ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా అబ్బాయిలకు అయితే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి డబ్బులు దాచుకుని మరి ఇష్టమైన కార్లు కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త కారు కంటే.. బాగా ఫేమస్ అయిన కారు తీసుకోవాలని అనుకుంటారు. అయితే ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటిని లైఫ్‌లో ఒక్కసారైనా కూడా డ్రైవ్ చేయాలని చాలా మంది కోరుకుంటారు. నిజానికి కొన్ని కార్లను లైఫ్‌లో ఒక్కసారి డ్రైవ్ చేస్తే చాలు ఇక జన్మలో వాటిని వదిలిపెట్టరు. ఎలాగైనా ఆ కారును కొనుగోలు చేయాలనుకుంటారు. అయితే ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు ఏవో మరి ఈ స్టోరీలో చూద్దాం.
రోల్స్ రాయిస్ బోట్ టైల్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ బోట్ టైల్. దీని ధర దాదాపుగా రూ.205 కోట్లు ఉంటుంది. ఈ కారు 5 సెకన్ల సమయంలో దాదాపుగా 100 కి.మీ వరకు వెళ్లిపోతుంది. ఈ కారును లైఫ్‌లో ఒక్కసారైనా డ్రైవ్ చేయాలని కోరుకుంటారు.
దుగతీ లా వోచర్ నోయిర్
ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన కారు దుగతీ లా వోచర్ నోయిర్. ఈ కారు ధర దాదాపుగా రూ.132 కోట్లు ఉంటుంది. ఇది గంటకు 420 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. చూడటానికి క్లాస్‌గా ఉండే ఈ కారును చాలా మంది ఇష్టపడతారు. ఒక్కసారి డ్రైవ్ చేస్తే లైఫ్‌కి ఇది చాలు అని కొందరికి అనిపిస్తుంది.
పగని జోండా హెచ్‌పి బెర్చెట్టా
అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో పగని జోండా హెచ్‌పి బెర్చెట్టా మూడో స్థానంలో ఉంది. దీని ధర దాదాపుగా రూ.125 కోట్లు ఉంటుంది. ఇది 2.8 సెకన్లలో 100 కి.మీ వెళ్తుంది. అయితే ఇలాంటి కార్లను పేద, మధ్య తరగతి వాళ్లు కొనుగోలు చేయలేరు. కేవలం ధనికులు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు.
రోల్స్ రాయిస్ స్విఫ్టైల్
అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ స్విఫ్టైల్ నాల్గవ స్థానంలో ఉంది. దీని ధర దాదాపుగా రూ.84 కోట్లు ఉంటుంది. ఈ కారు తయారీకి ఐదేళ్లు పట్టిందట. ఇది గంటకు 250 కి.మీ వేగంతో దూసుకుపోతుంది.
బుగట్టి సెంటోడీసీ
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఐదవ స్థానంలో ఉంది. దీని ధర దాదాపుగా రూ.64 కోట్లు ఉంటుంది. ఇది గంటకు 420 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ కార్లను సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేరు. ధనవంతులు మాత్రమే ఇలాంటి ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తుంటారు.