Sinusitis
Sinusitis: చలికాలంలో చాలా మందిని సైనసైటిస్ (Sinusitis) సమస్య వేధిస్తుంది. శీతాకాలంలో వచ్చే వెచ్చని గాలుల వల్ల చాలా మందికి ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు అసలు చల్లని పదార్థాలు తీసుకోరు. సైనసైటిస్ (Sinusitis) అంటే ముక్కులో ఇన్ఫెక్షన్లు (Infection), బ్యాక్టీరియా (Bacteria) చేరడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది. దీంతో వీరికి కాస్త చల్ల గాలి (Cold Hair) తగిలినా కూడా ముక్కు పనిచేయదు. మొత్తం ముక్కు బ్లాక్ అయిపోతుంది. దీంతో నొప్పి, మంట అన్ని లక్షణాలు కనిపిస్తాయి. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు దీని నుంచి విముక్తి పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
వెచ్చని కంప్రెస్
సైనస్ సమస్య ఉన్నవారు వెచ్చని కంప్రెస్‌ను పెట్టడం వల్ల ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
హైడ్రేటెడ్‌గా ఉండండి
శీతాకాలంలో నీరు తాగకపోతే సైనస్ సమస్య పెరుగుతుంది. పుష్కలంగా నీరు త్రాగడం వల్ల సైనసైటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. వాటర్ ఎక్కువగా తాగడం, హెర్బల్ టీ, సూప్ వంటివి తాగితే సమస్య తగ్గుతుంది.
హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి
చల్లని గాలి వల్ల ఇంట్లో తేమ ఉంటుంది. దీని కోసం ఇండోర్ హీటింగ్ వంటివి వాడాలి. అలాగే హ్యూమిడిఫైయర్‌ని ఉపయోగించడం వల్ల ఇంట్లో వేడిగా ఉంటుంది. ఈ వేడి వల్ల సైనస్ సమస్య తగ్గుతుంది.
మాస్క్ ధరించండి
దుమ్ము, ధూళి వల్ల సైనస్ సమస్య ఎక్కువ అవుతుంది. బయటకు వెళ్లిన మాస్క్ పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల కొంత వరకు సైనస్ సమస్య తగ్గుతుంది. అలాగే ఏసీకి దూరంగా ఉండండి. దీంతో సైనస్ సమస్య క్లియర్ అవుతుంది.
ముక్కును ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి
సైనస్ సమస్య ఉన్నవారికి ముక్కులో ఎప్పుడు ద్రవం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ముక్కును శుభ్రం చేసుకోండి. దీనివల్ల కాస్త ఉపశమనం అనిపిస్తుంది. అలాగే చిరాకు వంటివి ఉండవు. సైనస్ సమస్య ఉన్నవారు చల్లని పదార్థాలు అసలు తినవద్దు. ఎల్లప్పుడూ వేడిగా ఉండే పదార్థాలు తినడానికి ప్రయత్నించండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.