https://oktelugu.com/

Breath Shortness: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? ఇలా చేయండి

సమస్య వచ్చే వరకు ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి చాలా మంది నెగ్లెట్ చేస్తారు. దీని గురించి అసలు ఆలోచించరు. ఇక పెరుగుతున్న కాలుష్యం, ధూమపానం వంటి కారణాల వల్ల మన ఊపిరితిత్తులు మలినాలతో నిండిపోతాయి.

Written By: , Updated On : January 19, 2025 / 10:00 PM IST
Breath Shortness

Breath Shortness

Follow us on

Breath Shortness: ప్రస్తుత కాలంలో అనేక రకాల సమస్యలు వస్తున్న విషయం తెలిసిందే. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా..!! ఇన్ఫెక్షన్‌ వల్ల శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే చాలా మంది అసౌకర్యానికి గురవుతున్నారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఒక్కోసారి చలి అధికంగా ఉన్నప్పుడు, అనారోగ్యం సమస్య వచ్చినప్పుడు, లేదంటే ఎక్కువ బరువు ఉన్నా సరే శ్వాస తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక కొందరిలో ఈ సమస్య తాత్కాలికంగానే ఉంటుంది. కానీ మరి కొంతమందిలో మాత్రం అధికంగా ఉంటుంది.

సమస్య వచ్చే వరకు ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి చాలా మంది నెగ్లెట్ చేస్తారు. దీని గురించి అసలు ఆలోచించరు. ఇక పెరుగుతున్న కాలుష్యం, ధూమపానం వంటి కారణాల వల్ల మన ఊపిరితిత్తులు మలినాలతో నిండిపోతాయి. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో సహా అనేక సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో, అది మీకు సమస్యను తెచ్చి పెడుతుంది. సో కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. మరి దీని కోసం మీరు ఈ 5 సహజ నివారణలను ప్రయత్నించండి.

శ్లేష్మం లేదా రక్తంతో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, గొంతులో నొప్పి, గురక, ఏదైనా పని చేసిన తర్వాత త్వరగా అలసిపోవడం, వాంతులు, విరేచనాలతో వికారం వంటి సమస్యలు ఉంటే మీరు నెగ్లెట్ చేయకండి. కొన్ని రెమెడీలు పాటించడం వల్ల మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు.

వేడినీటిలో కొన్ని తాజా తులసి ఆకులను వేసి ఆవిరిని పీల్చుకోండి. 2017 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, తులసి వైద్యం లక్షణాల కారణంగా ఆయుర్వేద వ్యవస్థలో “జీవన అమృతం” గా పరిగణిస్తారు. తులసి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది శ్లేష్మం క్లియర్ చేయడానికి, శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం. అటువంటి పరిస్థితిలో, ఒక కప్పు పసుపు పాలు తాగడం వల్ల మీ ఊపిరితిత్తుల నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లి మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

లికోరైస్, అల్లం, పుదీనా వంటి మూలికలు ఊపిరితిత్తుల కోసం అద్భుతాలు చేస్తాయి. టీ తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించవచ్చని 2019లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. లైకోరైస్ మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం ఇన్ఫెక్షన్‌తో పోరాడుతుంది. పుదీనా శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తుంది.

మీ ఆహారంలో ఉసిరి, జామ, దానిమ్మ వంటి సూపర్ ఫుడ్స్‌ను చేర్చుకోండి. ఈ పండ్లలో విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల కణజాలాన్ని బాగు చేస్తాయి. మొత్తం శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..