కరోనా కాలంలో ఏం చేయాలన్నా.. ఏం ముట్టుకోవాలన్నా.. ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎటూ ప్రమాదం వస్తుందోననే భయాందోళన ప్రతీఒక్కరిలో నెలకొని ఉంటోంది. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్, సామాజిక సంస్థలు, వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయితే రోజుకో కరోనా న్యూస్ బయటికి వస్తుండటంపై ప్రజల్లో ఆందోళన నెలకొంటుంది. Also Read : ఆ గ్యాస్ తో కరోనా వైరస్ వ్యాప్తికి […]
Written By:
Neelambaram, Updated On : August 31, 2020 2:21 pm
Follow us on
కరోనా కాలంలో ఏం చేయాలన్నా.. ఏం ముట్టుకోవాలన్నా.. ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎటూ ప్రమాదం వస్తుందోననే భయాందోళన ప్రతీఒక్కరిలో నెలకొని ఉంటోంది. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్, సామాజిక సంస్థలు, వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయితే రోజుకో కరోనా న్యూస్ బయటికి వస్తుండటంపై ప్రజల్లో ఆందోళన నెలకొంటుంది.
జిత్తులమారి కరోనా వస్తువులపై ఎన్ని గంటలపాటు ఉంటుందనే విషయంలో యూనిసెఫ్ కొన్ని విషయాలను వెల్లడించింది. వైరస్ గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించలేదని.. వస్తువులపై 12గంటల కంటే ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదని స్పష్టం చేసింది. కరోనా కేసులు రోజుకురోజుకు పెరుగుతున్నవేళ ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. తాజాగా కళ్లజోళ్లపై కరోనా వైరస్ ఎన్నిగంటలు బ్రతికి ఉంటుందని పరిశోధన చేయగా షాకింగ్ న్యూస్ వెల్లడైంది.
ఈరోజుల్లో చాలా మంది కళ్లజోడు కామన్ అయిపోయింది. చిన్నతనం నుంచి కొందరు కళ్లజోళ్లను వాడుతుంటడం చూస్తూనే ఉన్నాం. అయితే కరోనా వైరస్ కళ్లద్దాలపై తొమ్మిదిరోజుల పాటు బ్రతికి ఉంటుందని తాజా పరిశోధనల్లో వెల్లడి కావడం ఒక్కింత ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో కళ్లజోడు ఉపయోగించే వారంతా మరింత జాగ్రత్త ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లేప్పుడు కళ్ళద్దాలను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే కళ్లద్దాలను శానిటైజర్ తో శుభ్రం చేయకూడని.. హైడ్రోజన్ పెరాక్సాయిడ్ తో మాత్రమే శుభ్రం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.