భారత్ లో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్.. పతాకస్థాయికి వైరస్ వ్యాప్తి..?

భారత్ లో మార్చి నెల తొలి వారం నుంచి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా విజృంభించిన తొలినాళ్లలో చాలామంది మే నెల చివరినాటికి ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చని భావించారు. అయితే రోజులు గడుస్తున్నా ఈ వైరస్ కట్టడి మాత్రం సాధ్యం కాలేదు. పలు దేశాలు కఠిన లాక్ డౌన్ ను అమలు చేయడం ద్వారా కేసుల సంఖ్యను తగ్గించినా ఆ దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమై ప్రజలను టెన్షన్ పెడుతోంది. మరి భారత్ […]

Written By: Navya, Updated On : October 19, 2020 7:56 pm
Follow us on

భారత్ లో మార్చి నెల తొలి వారం నుంచి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా విజృంభించిన తొలినాళ్లలో చాలామంది మే నెల చివరినాటికి ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చని భావించారు. అయితే రోజులు గడుస్తున్నా ఈ వైరస్ కట్టడి మాత్రం సాధ్యం కాలేదు. పలు దేశాలు కఠిన లాక్ డౌన్ ను అమలు చేయడం ద్వారా కేసుల సంఖ్యను తగ్గించినా ఆ దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమై ప్రజలను టెన్షన్ పెడుతోంది.

మరి భారత్ లో కరోనా మహమ్మారి సెకండ వేవ్ ఉంటుందా..? అనే ప్రశ్నకు శాస్త్రవేత్తల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాస్త్రవేత్తలు ప్రజలు వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చని లేకపోతే మాత్రం వైరస్ ను కట్టడి చేయడం అంత తేలిక కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత్ లో ఇప్పటివరకు 75 లక్షల కేసులు నమోదయ్యాయి. మరికొన్ని రోజులు కరోనా విజృంభణ ఇదే విధంగా కొనసాగితే కరోనా కేసుల సంఖ్య కోటి మార్కును దాటుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 1,14,000 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 10 శాతం మరణాలు భారత్ లోనే నమోదయ్యాయంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగా అర్థమవుతుంది.

అయితే భారత్ లో నమోదైన కేసులతో పోల్చి చూస్తే మరణాల సంఖ్య తక్కువే కావడం గమనార్హం. మరోవైపు దేశంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కరోనా వైరస్ పరీక్షలు కొనసాగుతున్నాయి. వైరస్, వ్యాక్సిన్ విషయంలో శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి.