దేశీయ టెలీకాం దిగ్గజం జియో కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. యూజర్లు ఎక్కువగా వినియోగిస్తున్న 222 రూపాయల ప్లాన్ విషయంలో కీలక మార్పులు చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ ప్యాక్ అయిన ప్లాన్ రేటును ఏకంగా 33 రూపాయలు పెంచింది. దీంతో జియో ప్లాన్ ధర ఏకంగా 255 రూపాయలకు చేరింది. కొన్ని నెలల క్రితం జియో ఈ ప్లాన్ ను కొత్తగా లాంఛ్ చేయగా యూజర్లు ఈ ప్లాన్ పై ఎక్కువగా ఆసక్తి చూపారు.
ఎక్స్ క్లూజివ్ లిమిటెడ్ పీరియడ్ అప్ గ్రేడ్ ఆఫర్ పేరుతో జియో ఈ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ తో సంవత్సరం పాటు డిస్నీప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ తో పాటు సంవత్సరం పాటు డిస్నీప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తుంది. 15 జీబీ డేటా హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో పాటు యుజర్లకు ఫ్రీగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ ద్వారా వాయిస్ కాలింగ్ లభించకపోవడం యూజర్లకు మైనస్ గా మారింది.
డిస్నీప్లస్ హాట్ స్టార్ యాప్‌ను మొబైల్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుని అందులో జియో నంబర్ ను, ఓటీపీని ఎంటర్ చేసి హాట్‌స్టార్ ను ఫ్రీగా వీక్షించవచ్చు. అయితే 222 ప్లాన్ లో మార్పులు చేసిన జియో మిగతా ప్లాన్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. జియో 401, 598 777, 2,599 రూపాయల ప్లాన్ల ద్వారా కూడా డిస్నీప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తోంది.
మరోవైపు ఇప్పటికే ఫీచర్ ఫోన్ల ద్వారా ఎన్నో సంచలనాలు సృష్టించిన జియో 2,500 రూపాయాలకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్లు 5జీ ఫోన్లు కావడం గమనార్హం. ఇదే ధరలో జియో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తే మాత్రం మరో సంచలనానికి జియో తెరలేపినట్టేనని చెప్పవచ్చు.