https://oktelugu.com/

బిగ్ బాస్ షో గుట్టు విప్పిన కుమార్ సాయి..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ నుంచి నిన్న కంటెస్టెంట్ కుమార్ సాయి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చిన కుమార్ సాయి బిగ్ బాస్ హౌస్ గురించి, కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలిమినేట్ అయినందకు పెద్దగా బాధ లేదని.. ప్రేక్షకుల తీర్పును గౌరవించాలని.. అయితే బయటకు వచ్చాక అందరూ తనకే ఓట్లేశామని చెబుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హౌస్ లోని కంటెస్టెంట్లలో కొందరికి తనేంతో అర్థం కాక తాను కన్ఫ్యూజ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 19, 2020 8:17 pm
    Follow us on

    బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ నుంచి నిన్న కంటెస్టెంట్ కుమార్ సాయి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చిన కుమార్ సాయి బిగ్ బాస్ హౌస్ గురించి, కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలిమినేట్ అయినందకు పెద్దగా బాధ లేదని.. ప్రేక్షకుల తీర్పును గౌరవించాలని.. అయితే బయటకు వచ్చాక అందరూ తనకే ఓట్లేశామని చెబుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    హౌస్ లోని కంటెస్టెంట్లలో కొందరికి తనేంతో అర్థం కాక తాను కన్ఫ్యూజ్ మాస్టర్ ను అని అనుకున్నారని వెల్లడించారు. అఖిల్ ప్రతి ఆటలో ఫెయిల్ అవుతున్నాడని.. మిగతా కంటెస్టెంట్లు అతనిని ఎగతాళి చేస్తున్నారని.. అందుకే తనను కరివేపాకుతో పోల్చానని చెప్పారు. తాను పాజిటివ్ గానే చెప్పినా అఖిల్ మాత్రం తన మాటలను నెగిటివ్ గా తీసుకున్నాడని పేర్కొన్నారు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు పైకి నటిస్తూ కంఫర్ట్ జోన్ లో గేమ్ ఆడుతున్నారని తెలిపారు.

    వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లడం తనకు మైనస్ అయిందని.. హౌస్ లో కొందరు తనను కావాలనే దూరం పెట్టారని తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో అన్నిటికంటే నామినేట్ చేయడం అతి కష్టమైన పని అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో నామినేట్ చేయాల్సి వచ్చిందని చెప్పాడని తెలిపారు, బిగ్ బాస్ షోలో తన వ్యక్తిత్వానికి మంచి మార్లులు పడ్డాయని కుమార్ సాయి వెల్లడించారు.

    కొన్ని సినిమాలు చేసినా సినిమాల ద్వారా తనకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పారు. బిగ్ బాస్ స్టేజ్ ద్వారా నాగార్జుఅన్ తన కథ వినడానికి గ్రీన్ సిగ్నల్ ఇఛ్చారని.. అదే తనకు దక్కిన గొప్ప ఆనందమని త్వరలోనే నాగార్జునకు కథ చెప్పబోతున్నానాని కుమార్ సాయి తెలిపారు. కుమార్ సాయి తన మాటల ద్వారా బిగ్ బాస్ షో, కంటెస్టెంట్ల గుట్టు విప్పారనే చెప్పాలి.