https://oktelugu.com/

Rohit Sharma : బంగ్లాదేశ్ తో సిరీస్ అని తేలిగ్గా తీసేయొద్దు.. గెలిస్తే రోహిత్ సేన 92 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టినట్టే.. ఎలాగంటే..

జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ టెస్ట్ సిరీస్ ఆడింది. మధ్యలో వన్డే, టి20 మ్యాచ్ లను మాత్రమే ఆడింది. ఆరు నెలల విరామం తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడబోతోంది. శ్రీలంకతో సిరీస్ తర్వాత 45 రోజుల విశ్రాంతి అనంతరం సొంత గడ్డపై భారత్ బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడబోతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2024 / 10:38 PM IST

    A series win against Bangladesh will break Rohit Sena's 92-year-old record

    Follow us on

    Rohit Sharma : సెప్టెంబర్ 19 నుంచి చెన్నై లోని చేపాక్ మైదానంలో తొలి టెస్ట్ షురూ కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ముందు టీం ఇండియాకు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. పైగా రోహిత్ సేన ఈ సిరీస్ గెలిస్తే 92 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టిన ఘనత సొంతం చేసుకుంటుంది. ఎందుకంటే టీమిండియా 1932 నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతోంది. ఇప్పటివరకు 579 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. అయితే ఇందులో 178 సార్లు గెలుపులను, ఓటములను నమోదు చేసింది. 222 మ్యాచ్ లను డ్రా చేసుకుంది. చెన్నై వేదికగా జరిగే టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే 92 సంవత్సరాల రికార్డును బద్దలు కొడుతుంది. అంతేకాదు భారత్ ఖాతాలో 179వ విజయం నమోదు అవుతుంది. అదే సమయంలో ఓటముల సంఖ్యను అధిగమిస్తుంది. 92 సంవత్సరాల భారత క్రికెట్ చరిత్రలో ఓటముల కంటే గెలుపులనే టీమిండియా ఎక్కువ నమోదు చేసినట్టవుతుంది. ఇప్పటికే చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు 16 మంది సభ్యులతో అక్కడికి వెళ్ళింది. సుదీర్ఘకాలం తర్వాత రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ జట్టులోకి ప్రవేశిస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ ఉత్కంఠ మధ్య జట్టులో అవకాశం దక్కించుకొని ఊపిరి పీల్చుకున్నాడు..

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ ఈ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో 8 టెస్టులు ఆడనుంది. ఇప్పటికే భారత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈసారి ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో విజయం సాధించి.. గదను దక్కించుకోవాలని భావిస్తోంది. గతంలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈసారి అలాంటి తప్పును చేయకుండా పగడ్బందీగా ఆడాలని భారత జట్టు యోచిస్తోంది. ఇందులో భాగంగానే జట్టు కూర్పు విషయంలో జాగ్రత్త వహిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అడుగును నిశితంగా వేస్తోంది.. ఇప్పటివరకు టీమిండియా టి20 వరల్డ్ కప్ రెండుసార్లు, వన్డే వరల్డ్ కప్ రెండుసార్లు దక్కించుకుంది..

    కానీ ఇంతవరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మాత్రం సాధించలేకపోయింది. అందువల్లే ఈసారి ఎలాగైనా టెస్ట్ గదను అందుకోవాలని ఆశాభావంతో ఉంది. అందువల్లే బంగ్లా సిరీస్ కు రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఆటగాళ్లు కూడా అందరూ ఫామ్ లో ఉండడం భారత జట్టుకు లాభిస్తోంది. అయితే బంగ్లాదేశ్ కూడా ఇటీవల పాకిస్తాన్ జట్టుపై రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకొని సంచలనం సృష్టించింది.