https://oktelugu.com/

బట్టతలతో బాధ పడుతున్నారా.. అద్భుతమైన టెక్నిక్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు..?

దేశంలో చాలామంది పురుషులు బట్టతల సమస్యతో బాధ పడుతున్నారు. చిన్న వయస్సులోనే బట్టతల రావడం వల్ల కొంతమంది పురుషులు ప్రత్యేకమైన చికిత్సల ద్వారా జుట్టును తిరిగి పొందాలని భావిస్తునారు. బట్టతల రావడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం 85 శాతం మంది పురుషుల జుట్టు 50 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి పలుచబడుతోంది. అమెరికన్ హెయిర్ లాస్ అసోసియేషన్ కొంతమంది పురుషులలో అసాధారణ లక్షణాల వల్ల 35 ఏళ్లకే బట్టతల వస్తోందని వెల్లడించింది. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 15, 2021 10:44 am
    Follow us on

    Baldness Cure

    దేశంలో చాలామంది పురుషులు బట్టతల సమస్యతో బాధ పడుతున్నారు. చిన్న వయస్సులోనే బట్టతల రావడం వల్ల కొంతమంది పురుషులు ప్రత్యేకమైన చికిత్సల ద్వారా జుట్టును తిరిగి పొందాలని భావిస్తునారు. బట్టతల రావడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం 85 శాతం మంది పురుషుల జుట్టు 50 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి పలుచబడుతోంది. అమెరికన్ హెయిర్ లాస్ అసోసియేషన్ కొంతమంది పురుషులలో అసాధారణ లక్షణాల వల్ల 35 ఏళ్లకే బట్టతల వస్తోందని వెల్లడించింది.

    Also Read: నవజాత శిశువుల్లో చర్మ వ్యాధులా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

    దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు, క్యాన్సర్, కరోనా లాంటి వ్యాధులకు చికిత్స తీసుకునేవాళ్లు ఎక్కువగా బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం బట్టతల కోసం ఉన్న థెరపీలు జుట్టు ఊడిపోకుండా చేయగలవు కానీ మళ్లీ వెంట్రుకలు పెరగడం సాధ్యం కాదు. అయితే జపాన్ లోని ఒక బృందం మాత్రం స్టెమ్ సెల్స్ తో బట్టతల సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చని చెబుతోంది.

    Also Read: జలుబు చేసినప్పుడు తినకూడని ఆహార పదార్థాలు ఇవే..?

    కుదుళ్ల నుంచి స్టెమ్ సెల్స్ సహాయంతో జుట్టును మొలిపించవచ్చని బయో సిస్టమ్స్ డైనమిక్స్ రీసెర్చ్ సైంటిస్టులు నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో మామ్మల్స్ పై ప్రయోగం చేసి పరిశోధన ఫలితాలను వెల్లడించారు. జుట్టు ఊడిపోవడం సాధారణ సమస్య అయినా వెంట్రుక ఊడిపోయిన చోట కొత్త వెంట్రుక రాకపోతే బట్టతల, ఇతర జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    స్టెమ్ సెల్స్ సహాయంతో జుట్టును వస్తే దేశంలో జుట్టు సమస్యలతో బాధ పడే చాలామంది సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బట్టతల రాకముందే ఈ చికిత్స భవిష్యత్తులో బట్టతల రాకుండా చేయవచ్చని.. ఈ చికిత్స భవిష్యత్తులో ఎక్కువమంది ఉపయోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.