https://oktelugu.com/

ఆ ఆస్పత్రిలో ఫీజు రూపాయి మాత్రమే.. ఎక్కడంటే..?

దేశంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల పేరు వింటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. ఆస్పత్రికి వెళ్లాలంటే కనీసం 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఓపీ ఫీజు కింద చెల్లించాలి. కొన్ని ప్రముఖ ఆస్పత్రుల్లో ఇంకా ఎక్కువ మొత్తమే ఆస్పత్రులు రోగుల నుంచి వసూలు చేస్తున్నాయి. అయితే ఒక ఆస్పత్రిలో మాత్రం క్లినిక్ ఫీజు కేవలం రూపాయి కావడం గమనార్హం. Also Read: పెన్షన్ తీసుకునే వారికి మోదీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 14, 2021 / 07:17 PM IST
    Follow us on

    దేశంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల పేరు వింటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. ఆస్పత్రికి వెళ్లాలంటే కనీసం 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఓపీ ఫీజు కింద చెల్లించాలి. కొన్ని ప్రముఖ ఆస్పత్రుల్లో ఇంకా ఎక్కువ మొత్తమే ఆస్పత్రులు రోగుల నుంచి వసూలు చేస్తున్నాయి. అయితే ఒక ఆస్పత్రిలో మాత్రం క్లినిక్ ఫీజు కేవలం రూపాయి కావడం గమనార్హం.

    Also Read: పెన్షన్ తీసుకునే వారికి మోదీ సర్కార్ శుభవార్త.. వారికి బెనిఫిట్..?

    పెరిగిన ఖర్చుల వల్ల జేబులో రూపాయి ఉంటే ఏమీ కొనలేని పరిస్థితి ఉన్నా ఆ ఆస్పత్రిలో మాత్రం ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కేవలం రూపాయి ఫీజుగా తీసుకుంటున్నాడు. ఒడిశా రాష్ట్రంలోని సంబల్ పూర్ జిల్లాలో శంకర్ రామచందాని అనే వ్యక్తి సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. శంకర్ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో బూర్లా అనే గ్రామంలో క్లినిక్ ను ప్రారంభించారు.

    Also Read: ఆ గ్రామంలో పురుషులకు నో ఎంట్రీ.. కారణమేంటంటే..?

    ఆ క్లినిక్ లో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు పేదవారికి సేవ చేయడం కోసం కేటాయించారు. నాణ్యమైన వైద్యంపొందలేని వారికి, దివ్యాంగులు, వృద్ధులకు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. శంకర్ భార్య సిఖా డెంటల్ సర్జన్ కాగా ఆమె కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ పేదలకు రూపాయికే వైద్య సేవలను అందిస్తుండటం గమనార్హం.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    తాము ఉచితంగా సేవ చేసుకుంటున్నామనే భావన ఉండకూడదనే ఉద్దేశంతో రూపాయి కూడా తీసుకుంటున్నామని వెల్లడించారు. కరోనా విజృంభించిన సమయంలో ఆస్పత్రికే ఎక్కువ సమయం కేటాయించి శంకర్ రామచందాని ప్రశంసలు అందుకొన్నారు.