https://oktelugu.com/

ముంబైలో విజ‌య్ దేవ‌ర‌కొండ.. స్టార్ హీరో కూతురితో రచ్చ!

సినిమా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాలంటేనే స‌ప్త‌స‌ముద్రాలు దాటినంత క‌ష్టం. అలాంటిది.. ఇండ‌స్ట్రీలో జెండా పాత‌డ‌మంటే..? ఇంచ మించు అసాధ్య‌మే. కానీ.. దాన్ని సుసాధ్యం చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించిన విజ‌య్‌.. క్రేజీ స్టార్ గా మ‌రిపోయాడు. ప్ర‌స్తుతం లైగ‌ర్ సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్లో స‌త్తా చాటేందుకు సిద్ధ‌మ‌వుతున్న ఈ హీరో.. లేటెస్ట్ గా ఓ స్టార్ హీరో కూతురితో కలిసి ముంబైలో హల్‌చల్ చేశాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ […]

Written By:
  • Rocky
  • , Updated On : February 14, 2021 / 06:01 PM IST
    Follow us on


    సినిమా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాలంటేనే స‌ప్త‌స‌ముద్రాలు దాటినంత క‌ష్టం. అలాంటిది.. ఇండ‌స్ట్రీలో జెండా పాత‌డ‌మంటే..? ఇంచ మించు అసాధ్య‌మే. కానీ.. దాన్ని సుసాధ్యం చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించిన విజ‌య్‌.. క్రేజీ స్టార్ గా మ‌రిపోయాడు. ప్ర‌స్తుతం లైగ‌ర్ సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్లో స‌త్తా చాటేందుకు సిద్ధ‌మ‌వుతున్న ఈ హీరో.. లేటెస్ట్ గా ఓ స్టార్ హీరో కూతురితో కలిసి ముంబైలో హల్‌చల్ చేశాడు.

    డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లైగర్’ మూవీలో నటిస్తున్న విజయ్.. ముంబైలోనే ఉన్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే లైగర్ రెగ్యులర్ షూట్ ముంబైలో ప్రారంభమైంది.

    Also Read: దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకుంటుందట !

    ‘లైగర్’ కోసం ముంబై వెళ్లిన విజయ్.. బాలీవుడ్ సెలెబ్రిటీలతో కలిసి తిరుగుతున్నాడు. పార్టీల్లో కూడా పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో స్టార్ హీరోలతోపాటు హీరోయిన్లతోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నాడు. అయితే.. తాజాగా ఓ స్టార్ హీరో కూతురితో కలిసి తిరుగుతూ మీడియా కంట పడడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు.

    బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌తో విజయ్ దేవరకొండ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. తాజాగా.. ముంబై నగరంలో జరిగిన ఓ పార్టీలో వీళ్లిద్దరూ జంటగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు హల్‌చల్ చేసిన విషయం వైరల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    Also Read: తనకు తానే డబ్బా కొట్టుకుంటున్న బోల్డ్ బ్యూటీ !

    అంతేకాదు.. విజయ్ దేవరకొండతో ఓ సెల్ఫీ దిగిన సారా అలీఖాన్.. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి ‘ఫ్యాన్ మూమెంట్’ అనే క్యాప్షన్ ఇవ్వడం విశేషం. సైఫ్ అలీఖాన్ కూతురు.. విజయ్ దేవరకొండతో ఫొటోదిగడం.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. దానికి ‘ఫ్యాన్ మూమెంట్’ అని కోట్ చేయడంతో చర్చనీయాంశం అయ్యింది. తాజాగా.. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో మరోసారి హైలైట్ అవుతున్నాడు విజయ్.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్