https://oktelugu.com/

Dates: కాళ్ల నొప్పులు ఉన్నాయా? వాటికి ఖర్జురాలతో చెక్

కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, జాయింట్ పేయిన్స్ వంటి వాటిని ఇవి నయం చేస్తాయి. కాల్షియం అధికంగా ఉంటుంది. మూత్ర సంబంధ వ్యాధులను నిరోధిస్తాయి

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2023 / 06:54 PM IST
    Follow us on

    Dates: బాదం, జీడిపప్పు, కిస్ మిస్, ద్రాక్ష, ఖర్జూరాలు డ్రైఫ్రూట్స్. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. దీంతో వీటిని తినడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. పొటాషియం అధికంగా ఉండటంతో ఇందులో సోడియం స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఎండబెట్టిన ఖర్జూరాలతో మనకు చాలా రకాల లాభాలు ఉంటాయి. పండు ఖర్జూరాలకంటే ఎండు ఖర్జూరాల్లోనే ప్రొటీన్లు అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    పాలలో కలిపి..

    ఎండు ఖర్జూరాలను పాలలో కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనాలు దక్కుతాయి. గ్లాసు పాలలో రెండు ఎండు ఖర్జూరాలు ముక్కలుగా చేసుకుని మరిగించాలి. ఖర్జూరాలు సహజంగానే తీపి కలిగి ఉండటంతో అందులో చక్కెర, బెల్లం వంటివి కలపాల్సిన అవసరం లేదు. రాత్రి పడుకునే ముందు ఖర్జూరాలను పాలతో కలిపి తినడం వల్ల ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

    పీచు పదార్థాలు

    ఖర్జూరాల్లో పీచు అధికంగా ఉంటుంది. దీంతో మన జీర్ణ వ్యవస్థ మెరుగ్గా అవుతుంది. మలబద్ధకం సమస్య దూరమవుతుంది. ఎసిడిటి, గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఖర్జూరాలు కలిపిన పాలలో వ్యాధులతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో అద్భుతమైన ప్రొటీన్లు ఉండటం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది.

    నొప్పులను దూరం చేస్తాయి

    కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, జాయింట్ పేయిన్స్ వంటి వాటిని ఇవి నయం చేస్తాయి. కాల్షియం అధికంగా ఉంటుంది. మూత్ర సంబంధ వ్యాధులను నిరోధిస్తాయి. యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. ఖర్జూరాలు నీటిలో నానబెట్టి తినడం వల్ల మన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎండు ఖర్జూరాలు తింటే మన దేహం బలోపేతంగా మారుతుంది. అందుకే వీటిని రోజు తీసుకోవడం మంచిది.