https://oktelugu.com/

Betel Leaves : తమలపాకులతో ఇలా చేస్తే రక్తంలో అస్సలు ఇక షుగర్ ఉండదు

తమలపాకులతో పాటు రెండు లవంగాలు కూడా తింటే మంచి ఫలితం ఉంటుంది. తమలపాకులతో మన ఆరోగ్యం బాగుపడుతుంది

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2023 6:44 pm
    Follow us on

    Betel Leaves : మధుమేహం నేడు వేగంగా విస్తరిస్తోంది. దీన్ని డయాబెటిస్, చక్కెర, షుగర్ అని పిలుస్తారు. దీంతో మన శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇండియా, చైనా దేశాలు దీనికి రాజధానులుగా మారుతున్నాయి. ఎందుకంటే మనం అన్నం ఎక్కువగా తింటున్నాం కాబట్టి మనకు షుగర్ వస్తోంది. చిన్న వయసులోనే మనం మధుమేహం బారిన పడి ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం. దీనికి చిన్న పరిహారాలు పాటిస్తే నియంత్రణలో ఉంటుంది. కానీ మనం ఇంగ్లిష్ మాత్రలు మింగుతూ ఏళ్లుగా దాంతో సహవాసం చేస్తున్నాం.

    మధుమేహం వస్తే పెద్ద నష్టమేమీ ఉండదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అది మనల్ని కబళిస్తుంది. మన దేహాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో మధుమేహాన్ని దూరం చేసుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఒకసారి షుగర్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుందని చెబుతారు. మధుమేహం వస్తే మన శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి.

    ఒళ్లును గుళ్ల చేసే రోగంగా దీన్ని చెబుతారు. ఇలా మధుమేహం మన శారీరక వ్యవస్థను దెబ్బతీస్తుంది. షుగర్ తో కంటి, లివర్, కిడ్నీ తదితర అవయవాలకు కూడా ప్రమాదం ఉంటుంది. చాలా మందిలో షుగర్ ఉన్న వారికి కిడ్నీ జబ్బులు రావడం సహజమే. దీంతో చక్కెరను అదుపులో ఉంచుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. దీనికి మనం చిట్కాలు పాటించి దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం మంచిది.

    మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంలో తమలపాకులు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని రోజు ఓ రెండు మూడు తింటే షుగర్ దిగొస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తమలపాకులతో పాటు రెండు లవంగాలు కూడా తింటే మంచి ఫలితం ఉంటుంది. తమలపాకులతో మన ఆరోగ్యం బాగుపడుతుందని ఎన్నో సందర్భాల్లో చెబుతుంటారు. ఇప్పుడు వాటిని తీసుకుని మనకు ఉన్న షుగర్ లేకుండా పోతుందని సూచిస్తున్నారు.