Refrigerator: ప్రస్తుతం రోజుల్లో అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ (refrigerator) ఉంటుంది. ఇంట్లో వండిన వంటలు అన్ని కూడా కొంచెం మిగిలిపోతే వాటిని ఫ్రిడ్జ్‌లో (refrigerator) పెట్టే్స్తారు. కేవలం కూరగాయలు అనే కాకుండా అన్నం (Rice) కూడా ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారు. కొందరు ఎక్కువగా వండటం వల్ల వేస్ట్ చేయకూడదని ఫ్రిడ్జ్‌లో పెడతారు. అయితే ఎందుకంటే ధాన్యాన్ని పండించిన వారికి ఆ బియ్యం విలువ తెలుస్తుంది. దీంతో వండిన అన్నం వృథా చేయకుండా కొందరు ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. అయితే వండిన అన్నం ఫ్రిడ్జ్‌లో అసలు ఉంచవచ్చా? ఒకవేళ ఉంచితే ఎంత సమయం ఉంచాలి? ఇలా ఫ్రిడ్జ్‌లో ఉంచిన అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా? లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వండిన అన్నం ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచాలంటే?
కొందరు ఎక్కువగా అన్నం వండుతుంటారు. తక్కువ అయితే ఆకలితో ఉంటారని ఎక్కువగా వండుతారు. దీంతో ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. అయితే వండిన అన్నం ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదని అందరూ అనుకుంటారు. కానీ వండిన అన్నం ఫ్రిడ్జ్‌లో పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్కువ రోజులు ఉంచకూడదు. కేవలం ఒక రోజు మాత్రమే ఫ్రిడ్జ్‌లో అన్నం ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత కొందరు వేడి చేయకుండా తినేస్తారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఫ్రిడ్జ్ నుంచి తీసిన అన్నాన్ని వేడి చేయకుండా అసలు తినకూడదు. వేడి చేసిన తర్వాతే తినాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్కువ సార్లు అన్నం వేడి చేసి తినకూడదని నిపుణులు అంటున్నారు. ఇలా తినడం వల్ల అందులోని పోషకాలు పోతాయి. దీంతో శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కూడా అందవు. కాబట్టి ఎక్కువగా ఫ్రిడ్జ్‌లో పెట్టవద్దు. ఒకవేళ పెట్టిన కూడా ఎక్కువ సార్లు వేడి చేసి తినవద్దని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా బియ్యం తొందరగా పాడవుతుంటే మాత్రం కొన్ని చిట్కాలు పాటించాలి. బియ్యంలో వేపాకు లేదా పసుపు వేసి నిల్వ ఉంచితే తొందరగా పాడవ్వవు. బియ్యాన్ని కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి. ఎక్కువగా కాకుండా ఫ్రిడ్జ్‌లో తక్కువగా ఒక 5 కేజీల వరకు పెట్టుకోవచ్చు. దీనివల్ల బియ్యం పురుగులు పట్టకుండా ఉంటుంది. ఇవే కాకుండా మిరియాలు, వెల్లుల్లి వంటివి కూడా బియ్యంలో ఉంచడం వల్ల ఎలాంటి పురుగులు పట్టవు. కొందరు బియ్యాన్ని నేలపై ఉంచుతారు. చలివిరికి బియ్యం పాడవుతుంది. అదే ఒక బల్లపై ఉంచితే బియ్యం పాడవుకుండా ఉంటాయి. ఎలాంటి చల్లదనం లేకుండా ఉండే ప్రదేశాల్లో బియ్యాన్ని ఉంచాలి. గాలి, చలివిరి వెళ్లకుండా ఉండే వాటిలో ఉంచితే బియ్యం ఎక్కువ రోజులు ఉంటాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.