Rashmi-Sudhir : బుల్లితెర మీద కొన్ని కాంబినేషన్స్ కి క్రేజ్ మామూలు రేంజ్ లో ఉండదు. ఈ కాంబినేషన్ బుల్లితెర పై కనిపించినప్పుడు ఆడియన్స్ కి కనులవిందులాగా అనిపిస్తాది. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి సుధీర్, రష్మిల జంటలది. వీళ్లిద్దరు జబర్దస్త్ అనే షో ద్వారా పరిచయమయ్యారు. సుధీర్ ఈ షోలో కంటెస్టెంట్ అయితే, రష్మీ యాంకర్ గా వ్యవహరించేది. స్కిట్స్ లో ఆమెపై అనేక సందర్భాలలో పంచులు వేయడం, అవి బాగా పేలడం వంటివి జరిగాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఈటీవీ లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ కలిసి చేసారు. అవన్నీ బాగా హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఢీ షోలో వీళ్లిద్దరి జోడికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూసి నిజంగానే ప్రేమికులు అని అందరూ అనుకున్నారు. ఆ యాంగిల్ కి టీఆర్ఫీ రేటింగ్స్ అదిరిపోవడంతో వీళ్లిద్దరిపై అనేక ప్రోగ్రామ్స్ డిజైన్ చేసేవాళ్ళు.
ఏ రేంజ్ లో అంటే సుధీర్ పేరు ఎత్తితే రష్మీ గుర్తుకు వచ్చే రేంజ్ లో వీళ్లిద్దరు ప్రేమికులు అని రుద్దేశారు. కానీ మా మధ్య అలాంటివి ఏమి లేదని, మేము కేవలం స్నేహితులు మాత్రమేనని, మేమిద్దరం ఫోన్ లో మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువని అనేక సందర్భాల్లో వీళ్లిద్దరు చెప్పుకొచ్చారు. కానీ జనాలు దానిని నమ్మలేదు. వీళ్ళు నిజమైన ప్రేమికులనే ఎక్కువగా నమ్మారు. అయితే ఈమధ్య కాలం లో వీళ్లిద్దరి కాంబినేషన్ ని ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. సుధీర్ సినిమాల్లో బిజీ అయిపోవడం తో ఈటీవీ లో అన్ని షోస్ కి దూరమయ్యాడు. చాలా కాలం తర్వాత రీసెంట్ గానే ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘ఫ్యామిలీ స్టార్స్’ అనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆ షో పెద్ద హిట్ అయ్యింది. మధ్యలో అప్పుడప్పుడు సుధీర్ వ్యాఖ్యాతగా కొన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ వస్తూనే ఉన్నాయి.
రీసెంట్ గానే సంక్రాంతి సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ తో ఒక ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సుధీర్ తో పాటు రష్మీ కూడా పాల్గొన్నది. చాలా కాలం తర్వాత బుల్లితెర మీద సందడి చేస్తుండడంతో వీళ్లిద్దరి కాంబినేషన్ ని తెగ వాడేశారు. రొమాంటిక్ సాంగ్ తో పాటు, అనేక లవ్ డైలాగ్స్ ని కొట్టించి మంచి హైప్ ని పెంచారు. ఈ ఎపిసోడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మీలో ఎవరైనా ఈ జోడికి ఫ్యాన్ అయితే, ఈ ఎపిసోడ్ ని చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ కుదరడం అంత తేలికైన విషయం కాదు. ఢీ షో ని వీళ్లిద్దరు వదిలి వెళ్లిపోయిన తర్వాత కల పోయిందని లక్షలాది మంది అభిమానులు అనుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు ఈ షో తో రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అది జరుగుతుందో లేదో చూడాలి.