వర్షకాలం, శీతాకాలం, వేసవికాలంలలో ఆయా కాలానికి తగిన విధంగా సీజనల్ వ్యాధులు వేధిస్తూ ఉంటాయి. అయితే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకుంటే మాత్రమే వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుంది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో జలుబు, దగ్గు లాంటి చిన్నచిన్న ఆరోగ్య సమస్యల విషయంలో సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి కొన్ని కీలక సూచనలు చేసింది.
గొంతుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా నీలగిరి, వాము ఆకులు, పుదీనాను పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్టును మెడపై రాస్తే గొంతు సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇంట్లో తయారు చేసుకోవడం వీలు కాకపోతే ఆయుర్వేధ ఔషధాలు అమ్మే దుకాణాలను సంప్రదించి ఈ పేస్ట్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల జలుబు సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
Also Read: ఆలస్యంగా డిన్నర్ చేస్తున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్..?
నీటిని బాగా వేడి చేసి ఆవిరి పట్టడం ద్వారా సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఫ్లూ, సాధారణ జలుబుతో బాధ పడే వాళ్లు ఆవిరి పట్టుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. శ్వాసకు ఇబ్బంది కలిగించే బ్యాక్టీరియాను ఆవిరి అంతం చేస్తుంది. అందువల్ల ఆవిరి పట్టడం ద్వారా సులువుగా జలుబు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Also Read: బ్రేక్ ఫాస్ట్ తో సులువుగా బరువు తగ్గవచ్చు.. ఎలా అంటే..?
ఆవిరిలో ట్రీ ట్రీ ఆయిల్ లేదా నీలగిరి, పుదీనా ఆకులు అమృతాంజనం వేస్తే మంచిది. పసుపు పాలు రోజూ తాగినా కూడా సులభంగా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. పసుపు పాలలో యాంటీ బయోటిక్, యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షించడంలో సహాయపడతాయి. పసుపు పాలు కరోనా రోగులకు సైతం వేగంగా వైరస్ నుంచి కోలుకోవడంలో సహాయపడతాయి.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం