
సామాన్య ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చడమే శాస్త్ర, సాంకేతికతల అంతిమ లక్ష్యం కావాలని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ దిశగా శాస్త్ర, సాంకేతికత విద్యాసంస్థలు, ప్రయోగ కేంద్రాలు, మరింత సృజనాత్మకత, సాంకేతికత పురోగతిని ప్రజలకు చేరవేయడంపై దృష్టిసారించాలని ఆయన సూచించారు. భారతదేశ యువశక్తి సామర్థ్యాలకు నైపుణ్యమనే పదును పెంచుతూ.. భవిష్యత్ భారత, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా వారిలో శాస్త్రీయ విజ్ఞానం, సాంకేతికత, అధునాతన పద్ధతులపై ఆసక్తి పెంపొందించేందుకు కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు.