లైఫ్ స్టైల్Rainy Season Precautions: వానకాలంలో జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా చేయండి

Rainy Season Precautions: వానకాలంలో జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా చేయండి

Rainy Season Precautions: వర్షాకాలంలో జబ్బులు ఎక్కువగా వస్తాయి. దోమల ప్రభావం అధికంగా ఉండటంతో కలరా, మశూచి, డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ఎక్కువగా వచ్చే కాలం ఇదే. దీంతో ఈ కాలంలో మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా వ్యాధులు సోకుతాయి. జీవక్రియ పనితీరు మందగిస్తుంది. పోషకాలతో కూడిన ఆహారాలు తీసుకోవడం మంచిది. దీంతో రోగాలు రాకుండా చేసుకోవచ్చు.

శుభ్రత

వర్షాకాలంలో శుభ్రతకు పెద్దపీట వేయాలి. ఎందుకంటే ఈ కాలం ఈగల కాలం. ఎటు చూసినా ఈగలే దర్శనమిస్తుంటాయి. దీంతో ఆహారాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మనం తీసుకునే ఆహారాలు కలుషితమైతే విష జ్వరాలు రావడం ఖాయం. క్రిములు మన దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్పత్రి పాలు కావడం తథ్యం.

తాగునీరు

వర్షాకాలంలో నీటి వల్ల చాలా రోగాలు వస్తాయి. 50 శాతం రోగాలు మంచినీరు వల్ల వస్తాయని చాలా మందికి తెలియదు. వర్షాకాలంలో కొత్తనీరు వస్తుంది. అందుకే నీటిలో క్రిములు ఎక్కువవుతాయి. అందుకే మనం కాచి చల్లార్చిన నీటిని తాగడం ఉత్తమం. నీటిని ఫిల్టర్ చేసుకోవడం మంచిదే. కూరగాయలను కూడా బాగా కడగాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి.

ఆహారం విషయంలో..

వర్షాకాలంలో ఆహారం త్వరగా పాడవుతుంది. మిగిలిపోయిన ఆహారం తినకపోవడమే బెటర్. పండ్లు, కూరగాయలను కూడా బాగా కడిగిన తరువాతే తినాలి. వాన కాలంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందే. సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉంటేనే తినాలి. అపరిశుభ్రంగా ఉన్న ఆహారాలు తింటే రోగాలు రావడం జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండటమే మన ఆరోగ్యానికి రక్షణ.

దోమల ద్వారా..

దోమల ద్వారా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి రోగాలు దోమల కాటు వల్లే వస్తాయి వర్షాకాలంలో దోమల ప్రభావం అధికంగా ఉంటుంది. నీరు నిలువ ఉండే ప్రాంతాల్లో అవి పెరిగి మనల్ని కుట్టడం ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. వీటి నుంచి రక్షించుకోవడానికి సరైన దుస్తులు ధరించాలి. క్రీములు రాసుకోవాలి. దోమతెరలు వాడాలి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Rainy Season Diseases: వర్షాకాలంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. జాగ్రత్త..

Rainy Season Diseases: వర్షాకాలం ప్రారంభమైన తర్వాత వాతావరణంలో తేమ పెరగడం, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం వల్ల వైరస్‌లు, బ్యాక్టీరియా వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. దీంతో జలుబు, జ్వరం, గొంతు...

Monsoon Health Tips: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు..ఈ జాగ్రత్తలతో సేఫ్..

Monsoon Health Tips: నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు జోరందుకోనున్నాయి. వర్షాలు వ్యవసాయానికి మేలు చేసినప్పటికీ, ఈ కాలంలో సీజనల్ వ్యాధులు వేగంగా...

Most Popular

Pimples Solution: మొటిమల సమస్యతో బాధపడేవారికి గుడ్ న్యూస్..

Pimples Solution: మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లు చాలా వరకు వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కొందరు అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్...

Deep Sleep Tips: వెంటనే గాఢ నిద్ర పట్టాలని అనుకుంటున్నారా… ఇలా చేయండి..

Deep Sleep Tips: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ లేదా టీవీని ఎక్కువసేపు చూడడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం...

Fatty Liver: అలసట..ఆకలి తగ్గడంతో పాటు ఈ సమస్యలు ఉన్నాయా..

Fatty Liver: అలసట, కుడివైపు పొత్తికడుపు పైభాగంలో అసౌకర్యం, బరువు పెరగడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. అయితే వీటిని లైట్ గా తీసుకుంటారు. పెద్ద ఆరోగ్య సమస్య...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...
Exit mobile version