Homeహెల్త్‌Fatty Liver: అలసట..ఆకలి తగ్గడంతో పాటు ఈ సమస్యలు ఉన్నాయా..

Fatty Liver: అలసట..ఆకలి తగ్గడంతో పాటు ఈ సమస్యలు ఉన్నాయా..

Fatty Liver: అలసట, కుడివైపు పొత్తికడుపు పైభాగంలో అసౌకర్యం, బరువు పెరగడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. అయితే వీటిని లైట్ గా తీసుకుంటారు. పెద్ద ఆరోగ్య సమస్య వచ్చే ముందు ఇలాంటి లక్షణాలే ఉంటాయని కొందరు వైద్యులు చెబుతున్నారు. అలాంటి వాటిలో ఫ్యాటీ లివర్ (Fatty Liver Disease) ఒకటి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో దీని గురించి ప్రధానంగా చెబుతున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కాలక్రమేణా లివర్‌లో తీవ్ర నష్టం జరిగే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇది రాకుండా ఏం చేయాలి? పై లక్షణాలు ఉన్న వెంటనే ఎలాంటి కేర్ తీసుకోవాలి?

ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి?
మన శరీరంలోని కాలేయం (లివర్)లో కొద్దిపాటి కొవ్వు ఉండటం సహజమే. కానీ లివర్ బరువులో 5 నుంచి 10 శాతానికి మించి కొవ్వు పేరుకుపోతే దానిని ఫ్యాటీ లివర్ అంటారు. ఇది ఎక్కువగా ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అనారోగ్యకర ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. మద్యం సేవించని వారిలో కూడా ఈ సమస్య ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది.

కృత్రిమ చక్కెరలే ప్రధాన కారణం
ప్రముఖ వైద్య నిపుణుల ప్రకారం.. ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి కృత్రిమ చక్కెరలు అని అంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసులు, బేకరీ పదార్థాలు, కేకులు, బిస్కెట్లు, స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే అధిక చక్కెర లివర్‌లో కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తుంది. కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలని ఆయన సూచిస్తున్నారు.

హై ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి
ఉదయం తీసుకునే అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో కీలకం. అధిక ప్రోటీన్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉండటమే కాకుండా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం కూడా తగ్గుతుంది. గుడ్లు, పెసరపప్పు, శనగలు, పెరుగు, పనీర్, ఓట్స్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను ఉదయాన్నే తీసుకోవడం లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆలివ్ ఆయిల్, చేపలు ఆహారంలో ఉండాలి
వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను పరిమితంగా ఉపయోగించడం, అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలను వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం వల్ల లివర్‌లోని కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి శరీరంలో వాపును తగ్గించడంతో పాటు లివర్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఫ్యాటీ లివర్‌ను ఎలా రివర్స్ చేయవచ్చు?
ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో ఉంటే జీవనశైలిలో మార్పులతో చాలావరకు నియంత్రించవచ్చు. శరీర బరువును 7–10 శాతం వరకు తగ్గించడం, ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం చేయడం, చక్కెరలు, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

అయితే ఫ్యాటీ లివర్‌ను చిన్న సమస్యగా భావించకుండా ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నియంత్రించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, బరువు నియంత్రణ, చక్కెరల వినియోగం తగ్గించడం ద్వారా లివర్‌ను దీర్ఘకాలం ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version