Vaishnavi Chaitanya: కూచుపూడి డ్యాన్స్ లో గిన్నిస్ రికార్డు..స్టేట్ లోనే నెంబర్ 1.. ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి బ్యాక్ గ్రౌండ్ చూస్తే మెంటలెక్కిపోతారు!

సినిమాల్లోకి రాకముందు యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా నటిస్తూ వచ్చిన ఈమె, ప్రముఖ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ షణ్ముఖ్ జస్వంత్ హీరో గా నటించిన 'సాఫ్ట్ వేర్ డెవలపర్' అనే వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ ని దక్కించుంది. ఈ సిరీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో ఈ సిరీస్ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఇందులో వైష్ణవి గా వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించింది.

Written By: Vicky, Updated On : July 16, 2023 2:55 pm

Vaishnavi Chaitanya

Follow us on

Vaishnavi Chaitanya: రీసెంట్ గా విడుదలైన ‘బేబీ’ మూవీ మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరు హీరో గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు, కేవలం హీరోయిన్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

సినిమాల్లోకి రాకముందు యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా నటిస్తూ వచ్చిన ఈమె, ప్రముఖ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ షణ్ముఖ్ జస్వంత్ హీరో గా నటించిన ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ ని దక్కించుంది. ఈ సిరీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో ఈ సిరీస్ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఇందులో వైష్ణవి గా వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించింది.

ఈ సిరీస్ తర్వాత ఆమెకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం లో అల్లు అర్జున్ కి చెల్లెలుగా , అలాగే న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘టక్ జగదీశ్’ చిత్రం లో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. అలా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన వైష్ణవి చైతన్య ఇప్పుడు ఇండస్ట్రీ లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఇకపోతే వైష్ణవి చైతన్య అసలు సినీ రంగం లోకి రాకముందు ఆమె ఏమిటి?, అంతకు ముందు ఆమె ఏమి చేసేది వంటివి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా చేసేది , ఇలాంటి విషయాలు తెలుసుకొని నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. చిన్నతనం నుండి వైష్ణవి కి డ్యాన్స్ అంటే తెగ ఇష్టమట.

ఈమె కూచిపూడి డ్యాన్స్ వెయ్యడం లో నిష్ణాతురాలు, అందులో ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంది. కూచుపొడి డ్యాన్స్ ఫామ్ లో వైష్ణవి కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. అంతే కాకుండా 2014 వ సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన డ్యాన్స్ పోటీలలో వైష్ణవి చైతన్య కి నెంబర్ 1 స్థానం లో నిల్చింది. అలా వచ్చిన ఫేమ్ తో ఆమెకి మెల్లగా షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశాలు, సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి అట.