Homeలైఫ్ స్టైల్Boiled Egg: గుడ్డు ఉడకబెట్టి తింటే మంచిదా.. వచ్చే మార్పులు ఇవే..

Boiled Egg: గుడ్డు ఉడకబెట్టి తింటే మంచిదా.. వచ్చే మార్పులు ఇవే..

Boiled Egg: గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. కోడిగుడ్ల ద్వారా శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. గుడ్లలో మన శరీరానికి కావల్సిన శాచురేటెడ్‌ ఫ్యాట్లు, పాలీ అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్స్, మోనో అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్స్, పొటాషియం, విటమిన్‌ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్‌ డి, విటమిన్‌ బి6, విటమిన్‌ బి 12, మెగ్నిషియం వంటి కీలక పోషకాలు ఉంటాయి. ఎందుకంటే గుడ్డు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. మెదడు ఆరోగ్యానికి గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్డు సొనలో కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడు నుండి సంకేతాలు వేగంగా అందేందుకు కూడా ఉపయోగపడుతుంది.

కాన్సర్‌ రాకుండా..
గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్‌ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్‌ ఎ ఉంటుంది. ఇది కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. అలానే నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. ఇది నరాల బలహీనత తగ్గేలా చేస్తుంది. గుండె జబ్బుల నివారణకు తోడ్పడుతుంది.

ఎలా తింటే మంచిదంటే..
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించే గుడ్డు విషయంలో అనేక మందికి అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గుడ్డును ఏ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిది. సర్వసాధారణంగా గుడ్డును ఉడకబెట్టి, లేదా ఆమ్లెట్‌లా వేసుకొని తింటా, మరికొందరు గుడ్డును పచ్చిగానే తాగేస్తుంటారు. ఇలా గుడ్డును ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటారు. అయితే, గుడ్డు ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

బాడీ బిల్డింగ్‌ చేసేవారికి పచ్చిగుడ్డు..
పచ్చి గుడ్డును అనేక మంది తీసుకుంటారు. వీటిలో ముఖ్య కారణం బాడీ బిల్డింగ్, కండరాల కోసం వారు గుడ్డును పచ్చిగా తీసుకుంటారు. బాడీ బిల్డింగ్‌ కోసం పచ్చి గుడ్డును ఎక్కువగా షేక్స్, స్మూతీలలో వేసుకొని తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కండరాలను నిర్మించడానికి ఎక్కువ ప్రోటీన్‌ పొందడానికి మంచి మార్గంగా పరిగణించబడుతుంది. అయితే గుడ్లను అలాగే కొట్టుకుని పచ్చిగా తాగొచ్చు. కానీ, పచ్చి కోడిగుడ్లలో సాల్మొనెల్లా అని ఓ రకమైన బాక్టీరియా ఉంటుందట. ఇది ఏ గుడ్డులోనైనా చాలా అత్యల్ప పరిమాణంలో ఉంటుంది. గుడ్డును అలాగే పచ్చిగా తాగేస్తే దాంతో అందులో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు పచ్చి గుడ్లను తాగకూడదు. అందువల్ల ప్రతి ఒక్కరు రోజుకో గుడ్డు అయినా తినాలి.

ఉడికించిన గుడ్డుతో..
అదే విధంగా పచ్చిగా తాగడం కన్నా ఉడికించి గుడ్డు తీసుకోవడం చాలా మంచిది. అన్ని వయసుల వారికి కావాల్సిన పోషకాలు ఇందులో ఎక్కవుగా ఉంటాయి. రోజూ ఆహారంలో గుడ్డు కూడా ఉండేలా చూసుకుంటే ప్రోటీన్స్, విటమిన్స్, పోషకాలు ఎక్కువగా పొందొచ్చు. అందుకే గుడ్డుని ఉడికించి తినడం వల్ల అనారోగ్యాన్ని నివారించడానికి మంచి కారణం, కానీ అది మాత్రమే కాదు. పచ్చి గుడ్డు కంటే ఉడికించిన గుడ్డు ఎక్కువ పోషక ప్రయోజనాలను అందిస్తాయి.

జీర్ణ సమస్యలు దూరం..
గుడ్డును ఉడికించి తింటే చాలా ప్రయోజనాలుంటాయి. ఉడికించిన గుడ్లలో ప్రోటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఒకవేళ మీరు కండరాలను పెంచడానికి పచ్చి గుడ్లు తాగటానికి ఇబ్బంది పడతుంటుంటే ఇక నుంచి ఉడికించిన గుడ్లను తీసుకోవచ్చు. ఎందుకంటే ఉడికించిన గుడ్లలో ప్రోటీన్‌ అధికంగా ఉంటుంది. నిజానికి, వండిన గుడ్లు ప్రోటీన్‌ పంచ్‌. ఉడికించిన గుడ్డు ప్రోటీన్‌ను విచ్చినం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మన శరీరాలు పచ్చి గుడ్డులో 50 నుండి 60 శాతం ప్రోటీన్లను గ్రహిస్తాయి. అదే ఉడికించిన గుడ్డులో 90 శాతం ప్రోటీన్లను గ్రహిస్తుంది.

గోర్లు, జుట్టు పెరుగుదలకు..
ఉడికించిన గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రోటీన్‌ను గ్రహిస్తాయి. గుడ్లలో జుట్టు, గోరు పెరుగుదలకు ముఖ్యమైన బయోటిన్‌ అనే నీటిలో కరిగే విటమిన్‌ కలిగి ఉంటాయి. పచ్చి గుడ్లలో అవిడిన్‌ అనే ప్రోటీన్‌ ఉంటుంది. ఇది బయోటిన్‌ గ్రహించకుండా నిరోధిస్తుంది. గుడ్లను ఉడికించడం ద్వారా ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడం వల్ల మన శరీరాలు గుడ్లలోని బయోటిన్‌ను గ్రహిస్తాయి. అందుకే రోజూ గుడ్డును తినాలంటే ఉడికించుకుని తింటేనే మంచిది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular