Homeబిజినెస్Vaishya business secrets : వ్యాపారంలో వైశ్యులు ఎందుకు రాణిస్తారు ? వారి సక్సెస్ సీక్రెట్...

Vaishya business secrets : వ్యాపారంలో వైశ్యులు ఎందుకు రాణిస్తారు ? వారి సక్సెస్ సీక్రెట్ ఏంటీ

Vaishya business secrets :  వ్యాపారం చేయడానికి చాలామంది ఉత్సాహం చూపుతారు. ఎందుకంటే సొంతంగా ఎంత కష్టపడితే అంత డబ్బులు సంపాదించుకోవచ్చని ఆలోచనతో ఉంటారు. అంతేకాకుండా లిమిట్ లేని ఆదాయం వచ్చే అవకాశాలు వ్యాపారంలో మాత్రమే ఉంటాయి. అయితే ఎంతమంది వ్యాపారం చేసినా వైశ్యులు చేసే వ్యాపారం ఇతరులకు రాదు అని కొందరు చెబుతూ ఉంటారు. వారి దగ్గర బిజినెస్ ట్రిక్స్ చాలా వరకు ఉంటాయని కొందరు చెబుతుంటారు. అసలు వారు వ్యాపారాన్ని ఎలా నిర్వహిస్తారు? వారి […]

Vaishya business secrets :  వ్యాపారం చేయడానికి చాలామంది ఉత్సాహం చూపుతారు. ఎందుకంటే సొంతంగా ఎంత కష్టపడితే అంత డబ్బులు సంపాదించుకోవచ్చని ఆలోచనతో ఉంటారు. అంతేకాకుండా లిమిట్ లేని ఆదాయం వచ్చే అవకాశాలు వ్యాపారంలో మాత్రమే ఉంటాయి. అయితే ఎంతమంది వ్యాపారం చేసినా వైశ్యులు చేసే వ్యాపారం ఇతరులకు రాదు అని కొందరు చెబుతూ ఉంటారు. వారి దగ్గర బిజినెస్ ట్రిక్స్ చాలా వరకు ఉంటాయని కొందరు చెబుతుంటారు. అసలు వారు వ్యాపారాన్ని ఎలా నిర్వహిస్తారు? వారి దగ్గర ఎలాంటి పద్ధతులు ఉంటాయి?

వ్యాపారంలో రాణించాలంటే ముందుగా చిన్నస్థాయి నుంచి వెళ్లాలని అనుకోవడం. చాలామంది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు. ఆ తర్వాత కలిసి రాకపోతే భారీగా నష్టపోతారు. కానీ చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టి.. ఆ వ్యాపారంలో తాము రాణిస్తామా? లేదా అని తెలుసుకోవాలి? ఒకవేళ ఈ చిన్న వ్యాపారంలో రాణించగలిగితే ఆ తర్వాత తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలి.

వ్యాపారం అనేది కేవలం లాభం కోసమే చేస్తామని అంటుంటారు. కానీ వ్యాపారం ప్రారంభించిన కొత్తలో ఎలాంటి లాభపక్ష ఆశ ఉండకూడదు. కొన్ని సంవత్సరాలపాటు కస్టమర్లను తమ ప్రొడక్ట్స్ కు అలవాటు చేసే విధంగా తమ వ్యాపారాన్ని కొనసాగించాలి. అంటే ప్రారంభించిన కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు లాభాపేక్ష లేకుండా సమయానికి వస్తువులను అందించే విధంగా నేర్చుకోవాలి. ఆ తర్వాత కస్టమర్లకు అందుబాటులో వస్తువులను ఉంచి ధరలు పెంచడం లేదా కొనుగోలు శక్తిని పెంచి లాపాపేక్ష గురించి ఆలోచించుకోవచ్చు.

వ్యాపారాలు చేయాల్సిన మరో ముఖ్యమైన పని లెక్కలను స్పష్టంగా ఉంచుకోవడం. ప్రతి రూపాయి ఎందుకు ఖర్చు చేశాం? ఆ రూపాయితో ఎంత లాభం వచ్చింది? అన్న విషయంలో స్పష్టత ఉండాలి. వ్యాపారంలో వచ్చే ఆదాయం అలాగే వ్యాపారానికి చేసే ఖర్చులు ప్రత్యేకంగా ఉండాలి. దీనికి సంబంధించిన డబ్బును వ్యక్తిగతానికి ఉపయోగించకూడదు. అలా చేస్తే అయోమయానికి గురై భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.

సమాజంలో గుర్తింపుతో కూడా వ్యాపారం అభివృద్ధి చెంది అవకాశం ఉంటుంది. అందుకోసం కమ్యూనికేషన్స్ డెవలప్ చేసుకునే తత్వం ఉండాలి. అంటే ప్రతి కస్టమర్ తో మర్యాదగా ప్రవర్తిస్తూ.. వారు మరో విధంగా తమ ప్రోడక్ట్ కోసం వచ్చే విధంగా మెదలాలి. అంతేకాకుండా వారికి అడిగిన సౌకర్యాలను అందిస్తూ సంతృప్తి పరచాలి. ప్రోడక్టు నాణ్యత విషయంలో కూడా రాజీ పడకుండా ఉంటే వారు రెగ్యులర్ కస్టమర్లు గా మారే అవకాశం ఉంటుంది.

ఒకవైపు కస్టమర్లతో కమ్యూనికేషన్స్ డెవలప్ చేసుకుంటూనే.. మరోవైపు ప్రోడక్ట్ సరఫరా చేసే వారితో కూడా మంచి సంబంధాలు నెలకొల్పాలి. డిమాండ్ కు తగ్గట్టుగా వస్తువులను అందించే విధంగా వారితో మంచి సంబంధాలు ఉంచితే కస్టమర్లకు అవసరమైన సమయంలో వస్తున్న అందించే విధంగా నమ్మకాన్ని ఏర్పరచుకోవచ్చు. దీంతో కొనుగోలు శక్తి పెరిగే అవకాశం ఉంటుంది.

కొందరు సమయానికి అనుకూలంగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తారు. కానీ ఎక్కువసేపు వ్యాపారం చేసే వారిపై కస్టమర్ల దృష్టిపడుతుంది. ఏ సమయానికి వెళ్లిన వీరు ఉంటారు.. అన్న నమ్మకం వారిలో కరిగితే పదేపదే రావడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా సెలవు రోజుల్లోనూ కూడా వ్యాపారం చేస్తే మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది…

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper