ఒత్తిడితో బాధపడేవాళ్లు యోగా చేస్తే ఏం అవుతుందో తెలుసా?

మారుతున్న కాలంతో పాటే మనుషుల్లో ఒత్తిడి పెరుగుతోంది. చిన్నచిన్న సమస్యలు ఎదురైనా ఒత్తిడిగా భావించే వాళ్లు మనలో ఎంతోమంది ఉన్నారు. మరి ఒత్తిడి సమస్యలు ఎదురు కాకముందే యోగా చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి…? యోగా వల్ల మనకు శారీరకంగా, మానసికంగా కలిగే ప్రయోజనాలు ఏమిటి…? యోగా చేయడం వల్ల నిజంగానే మంచి ఫలితాలు కనిపిస్తాయా…? అనే ప్రశ్నలకు సమాధానంగా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఆరోగ్య నిపుణులు యోగాకు సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. సాధారణంగా ఒత్తిడితో […]

Written By: Kusuma Aggunna, Updated On : August 20, 2020 6:13 pm
Follow us on

మారుతున్న కాలంతో పాటే మనుషుల్లో ఒత్తిడి పెరుగుతోంది. చిన్నచిన్న సమస్యలు ఎదురైనా ఒత్తిడిగా భావించే వాళ్లు మనలో ఎంతోమంది ఉన్నారు. మరి ఒత్తిడి సమస్యలు ఎదురు కాకముందే యోగా చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి…? యోగా వల్ల మనకు శారీరకంగా, మానసికంగా కలిగే ప్రయోజనాలు ఏమిటి…? యోగా చేయడం వల్ల నిజంగానే మంచి ఫలితాలు కనిపిస్తాయా…? అనే ప్రశ్నలకు సమాధానంగా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.

ఆరోగ్య నిపుణులు యోగాకు సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. సాధారణంగా ఒత్తిడితో బాధ పడే వారు నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఎల్లవేళలా నిరుత్సాహంతో జీవనం గడుపుతూ ఉంటారు. అవతలి వ్యక్తులపై కోపాన్ని చూపించలేక జీవితాన్ని భారంగా మోస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధ పడే వారికి యోగా చక్కని పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు. మన నెగిటివ్ ఆలోచన తీరు సైతం యోగా వల్ల పాజిటివ్ గా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

యోగా చేయడం వల్ల మన ఫీలింగ్స్ మనకు తెలుస్తాయని… యోగా చేసే సమయంలో మనల్ని మనం విమర్శించుకోకూడదని… మనం ఏ విషయాల్లోనైనా నెగిటివ్ గా ఆలోచిస్తున్నామని తెలిస్తే ఆ ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చడానికి యోగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి సందర్భంలోనైనా మనం సొంతంగా ఆలోచించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి యోగా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏ వ్యాయామంతో పోల్చి చూసినా యోగాకు ప్రత్యేక విశిష్టతలు ఉన్నాయి. శరీరం, మెదడు, ఆత్మ అన్నింటినీ వృద్ధి చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది.