https://oktelugu.com/

‘నిశ్శబ్దం’గా 25 కోట్ల డీల్… అక్కడ శబ్దం చేస్తుందా మరి?

పాపం అనుష్క శెట్టి. ఆమె ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు దానికి తగిన ఫలితం రావడం లేదు. తన మంచితనం, అమాయకత్వం వల్ల అమెనే లాస్‌ అవుతోంది. ఎంతటి స్టార్డమ్‌ ఉన్నా.. తన డేట్స్‌ కోసం కోట్ల కట్టలతో దర్శక, నిర్మాతలు రెడీగా ఉన్నా మనసుకు నచ్చిన సినిమాలే చేస్తుంది స్వీటి. ఒకసారి హామీ ఇస్తే ఎంత కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా చివరి దాకా తోడుంటుంది. బాహుబలి చేస్తున్న టైమ్‌లో గ్యాప్‌ దొరికింది కదా అని ‘సైజ్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 20, 2020 / 06:06 PM IST
    Follow us on


    పాపం అనుష్క శెట్టి. ఆమె ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు దానికి తగిన ఫలితం రావడం లేదు. తన మంచితనం, అమాయకత్వం వల్ల అమెనే లాస్‌ అవుతోంది. ఎంతటి స్టార్డమ్‌ ఉన్నా.. తన డేట్స్‌ కోసం కోట్ల కట్టలతో దర్శక, నిర్మాతలు రెడీగా ఉన్నా మనసుకు నచ్చిన సినిమాలే చేస్తుంది స్వీటి. ఒకసారి హామీ ఇస్తే ఎంత కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా చివరి దాకా తోడుంటుంది. బాహుబలి చేస్తున్న టైమ్‌లో గ్యాప్‌ దొరికింది కదా అని ‘సైజ్‌ జీరో’ చేసిందామె. సహజత్వం కోసం బరువు పెరిగింది. ప్రాణం పెట్టి నటించింది. కానీ, ఆ సినిమా ఫ్లాప్‌ అయింది. ఆ తర్వాత బహుబలి కోసం బరువు తగ్గేందుకు చాలా కష్టడాల్సి వచ్చింది. ఇక, బాహుబలి తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగినా, ఎన్నో ఆఫర్లు వచ్చినా మనసుకు నచ్చిన ‘నిశ్శబ్దం’ మూవీపైనే పూర్తిగా దృష్టి పెట్టిందామె. హేమంత్‌ మధుకర్ తెరకెక్కించిన ఈ సినిమాకు కోన వెంకట్‌ కథ అందించి నిర్మించారు. అనుష్క ప్రధాన పాత్ర పోషించగా.. మాధవన్‌, అంజలి, మైఖేల్‌, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ ఇతర పాత్రల్లో నటించారు. చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. అప్పటి నుంచి థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా? సినిమాను ఎప్పుడు రిలీజ్‌ చేద్దామా? అనుకుంటోంది అనుష్క, చిత్ర బృందం.

    Also Read: బాప్‌రే.. ప్రభాస్‌ ఆదిపురుష్‌ గ్రాఫిక్స్‌కే రూ. 250 కోట్లు!

    ఓటీటీలో రిలీజ్‌ చేయమని పలువురు సలహా ఇచ్చినా ససేమిరా అన్నది. ఇది థియేటర్లో చూపించాల్సిన చిత్రం అన్నాడు నిర్మాత కోన వెంకట్‌. కానీ, థియేటర్లు ఇప్పట్లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపించకపోవడంతో అతను మనసు మార్చుకున్నాడు. ‘థియేటర్ల కోసం జనవరి, ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సి వస్తే నిశ్శబ్దం సినిమాకు మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు?’ థియేటర్లోనా, ఓటీటీలోనా, ఎక్కడైనా సరేనా’ అని ట్విట్టర్లో పోల్‌ నిర్వహించాడు. ఎక్కువ మంది ఓటీటీకే మొగ్గు చూపడంతో పాటు ఫస్ట్‌ కాపీ రెడీ అయ్యాక ఎక్కువ కాలం ల్యాబ్‌లో ఉంటే తనకే నష్టం అని భావించిన కోన.. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేయాలని డిసైడయ్యాడట. చిత్ర నిర్మాణంలో భాగమైన వారు కూడా ఒత్తిడి తేవడంతో మనసు మార్చుకున్నాడు.

    Also Read: విజయ్ – మురుగదాస్‌ నాలుగోసారి..

    ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌తో ఒప్పందం కూడా జరిగినట్టు సమాచారం. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ అమెజాన్‌ రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. అయితే, ఆ రేటు తెలుగు హక్కులకేనా? లేకా అన్ని భాషలకా? అన్నది తేలాల్సి ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే అమెజాన్‌ ప్రైమ్‌లో నిశ్శబ్దం స్ట్రీమ్‌ అవుతుందని తెలుస్తోంది. దీనిపై తొందర్లోనే అధికారిక ప్రకటన రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ చేయనున్నారట. అయితే, వెండితెరనే శబ్దం చేయాల్సిన సినిమా అని ఇన్నాళ్లు ల్యాబ్‌లో మగ్గబెట్టిన నిశ్శబ్దం మొబైల్‌ తెరపై ఎలాంటి శబ్దం చేస్తుందన్నది ఆసక్తికరం.