Parenting Tips: పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి సరైన ఆహారం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆహారం ద్వారానే పిల్లలకు సరైన పోషకాలు లభిస్తాయి. ఇవి వారి అభివృద్ధికి సహాయపడతాయి. కానీ గత 10 నుంచి 15 సంవత్సరాలలో, భారతదేశం లో ప్రాసెస్ చేసిన,జంక్ ఫుడ్ ధోరణి వేగంగా పెరిగింది. పెద్దలతో పోలిస్తే, పిల్లలు మార్కెట్లో లభించే చిప్స్, స్టిక్స్, షాపింగ్, లాలీ పాప్స్, క్యాండీల రంగురంగుల ప్యాకెట్లకు ఆకర్షితులవుతున్నారు. పిల్లల ఏడుపు తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా పిల్లలకు అలాంటి పదార్థాలను అందిస్తున్నారు. అయితే పిల్లలకు ఏ ఆహారాలు మంచివి? ఏ ఆహారాలు మంచివి కాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పిల్లలు బాగా చదవాలి. మంచి మెమోరీ ఉండాలంటే మీరు బిస్కెట్స్ వంటివి బ్యాన్ చేయాలి. ఇవి అసలు పెట్టవద్దు. దీనికి బదులు వాల్ నట్స్ ఇవ్వడం చాలా మంచిది. వీటి వల్ల పిల్లల మెమోరీ పవర్ డబుల్ అవుతుంది. నానబెట్టి ఇస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది అంటున్నారు నిపుణులు.
Also Read: మీ పిల్లలకు ఈ రెండు అలవాట్లు నేర్పిస్తున్నారా? లేకపోతే కష్టమే..
ఇక కంటి దృష్టి మెరుగు అవ్వాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. మీరు మీతో పాటు మీ పిల్లల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. మీ పిల్లల కంటి దృష్టి బాగుండాలంటే వారికి ముందుగా ఆ చెండాలమైన టెట్రా ప్యాక్ జ్యూస్ లను ఇవ్వడం మానేయండి. వారి కంటి దృష్టి మెరుగు అవ్వాలన్నా, కంటి సమస్యలు రావద్దు అనుకున్నా సరే క్యారెట్లు ఇవ్వండి. ఇవి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి.
ఇక కొందరు తమ పిల్లలకు అప్డేట్ అంటూ కాన్ ఫ్లేక్ పెడుతున్నారు. కానీ వారి ఎదుగుదల బాగుండాలంటే వీటిని ఇప్పుడు బ్యాన్ చేయండి. దీనికి బదులు వారికి రోజు గుడ్లను ఇవ్వండి. ఇవి వారి ఎదుగుదలకు చాలా తోడ్పడుతాయి.
వారి ఎముకల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. మీరు మీ పిల్లలకు నూడిల్స్, మ్యాగీ వంటి ఫుడ్ పెడుతున్నారా? అయితే వారి ఎముకలను మీరే పాడుచేస్తున్నట్టు. అందుకే వీటిని బ్యాన్ చేసి రాగి దోశ, రాగి జావ వంటివి పెట్టండి. చాలా ప్రయోజనం చేకూరుతుంది అంటున్నారు నిపుణులు.
వారి గట్ ఆరోగ్యం బాగుండాలంటే బయటి కొన్ని డ్రింక్స్ ఇవ్వడం మానేయండి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్. దీనికి బదులు వారికి ఇంట్లోనే మజ్జిక చేసి ఇవ్వండి. చాలా సమస్యలు తొలిగిపోతాయి. ముఖ్యంగా వారికి ప్రయోజనాలు కూడా చేకూరుతాయి.
Also Read: ఇలాంటి ఫన్నీ వీడియో తయారు చేయాలని అనుకుంటున్నారా? మీ మొబైల్ లోనే చేయొచ్చు..
ఇక ఎత్తు పెరగాలని వారికి పాలల్లో ఏదో ఒక పౌడర్ వేసి ఇస్తున్నారా? అయితే ఇప్పుడే స్టాప్ చేయండి. దీనికి బదులు బయట ఆడుకోవడం, జంపింగ్, రన్నింగ్, క్లైమ్బింగ్ వంటివి చేయించండి. వీటి వల్ల వారికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.