https://oktelugu.com/

Paneer v/s Eggs : పనీర్ v/s గుడ్లు.. ఏది బెటర్?

మరి గుడ్లు బెటర్ అని కేవలం గుడ్లనే తింటారా? రోజు తినడం అంటే కష్టమే కదా. అందుకే పనీర్ ను కూడా మీ డైట్ లో భాగం చేసుకోండి.

Written By:
  • NARESH
  • , Updated On : May 19, 2024 5:45 pm
    Paneer v/s Eggs

    Paneer v/s Eggs

    Follow us on

    Paneer v/s Eggs : ఆరోగ్యం కోసం రోజు ఒక గుడ్డు తినాలి అంటారు డాక్టర్లు. ఇక జిమ్ కు వెళ్లేవారు, వ్యాయామాలు చేసేవారు, ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకునేవారు కచ్చితంగా గుడ్లను తింటారు. అయితే ఈ మధ్య పనీర్ వాడకం కూడా చాలా పెరిగింది. పనీర్ ను కూడా ఆరోగ్యం కోసం ఉపయోగిస్తున్నారు. ఇంతకీ ఈ రెండింటిలో ఏది బెటర్? దేనికి ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి అనే వివరాలు ఓ సారి తెలుసుకుందామా..

    గుడ్లలో శరీరానికి అవసరం అయ్యే అన్ని పోషకాలు ఉంటాయి. ఒక పెద్ద సైజ్ ఎగ్ లో 7 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. వీటిలో మొత్తం విటమిన్లు, బీ12, రైబోఫ్లెమిన్స్, సెలినియమ్, కాల్షియం, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇక పనీర్ కూడా తక్కువ ఏం కాదండోయ్. ఇందులో కూడా చాలా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

    కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు కూడా పనీర్ లో లభిస్తాయి. మరి ఈ రెండింటిలో ఏది బెటర్ అంటే..రెండు బెటర్ అంటున్నారు నిపుణులు. కానీ శరీరానికి అత్యవసరంగా ఉపయోగపడే అమైనో ఆమ్లాలు ఎగ్ లో ఉంటాయి. అంటే పనీర్ కంటే గుడ్లు ఒక అడుగు ముందే ఉన్నాయి అన్నమాట.

    మరి గుడ్లు బెటర్ అని కేవలం గుడ్లనే తింటారా? రోజు తినడం అంటే కష్టమే కదా. అందుకే పనీర్ ను కూడా మీ డైట్ లో భాగం చేసుకోండి. ఇక టేస్టీ పనీర్ మసాలా, పాలక్ పనీర్ లను తినకుండా ఉండగలరా? అందుకే ఈ రెండు మీ డైట్ లో ఉండటం బెటర్.