Jabardasth Comedian: జబర్దస్త్ కమెడియన్ పవిత్ర కారు ప్రమాదానికి గురైంది. ఈ నెల 11న ఓటు వేయడానికి సొంతూరు కి వెళ్తుండగా ఆమెకు యాక్సిడెంట్ జరిగింది. ఆమెతో పాటు తన కుటుంబ సభ్యులు కారులో ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం జరగలేదు. కారు నాశనమైంది. చిన్న గాయాలతో బయటపడ్డామని పవిత్ర ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మొదట్లో యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది పవిత్ర.
అనంతరం జబర్దస్త్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు షోలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే గత ఏడాది కారు కొనుక్కున్నట్లు ఓ వీడియో చేసింది. ఇప్పుడు ఆ కారే ప్రమాదానికి గురైంది. మే 11న ఓటు వేయడానికి తన సొంతూరు సోమశిల బయలుదేరారు. నెల్లూరు ఉప్పలపాడు హైవేపై ఎదురుగా వచ్చే మరో కార్ వీళ్ళ కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
పవిత్ర తో పాటు కారులో ఉన్న కుటుంబ సభ్యులు చిన్న గాయాలతో బయటపడ్డారు. కానీ కారు ముందు భాగం మాత్రం తుక్కు తుక్కయింది. తాజాగా ఓ వీడియో ద్వారా పవిత్ర ఈ విషయం తెలియజేసింది. పవిత్ర మాట్లాడుతూ .. మా పిన్ని పిల్లలు ఫస్ట్ టైం నా కారు ఎక్కారు. ఇంకో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాము అనేలోపు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న వెహికల్ వల్ల మాకు ఇలా జరిగింది.
ఎవరికీ ఎలాంటి దెబ్బలు తగలక పోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల సేఫ్ గా బయటపడ గలిగాను. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుట పడటానికి ఒక రోజంతా పట్టింది. కష్టపడి కొనుకున్న కారు నాశనమైపోయింది. ప్రాణాలతో ఉంటామని అసలు అనుకోలేదు. కానీ ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాం. మీ ప్రేమ వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ పవిత్ర చెప్పుకొచ్చింది.
https://youtu.be/mbzNW1sZZW0