Varun Dhawan: వెండితెరపై అలరించిన కొందరు నటులు.. రియల్ లైఫ్ లో భారమైన కష్టాలు పడుతున్నారు. ఇటీవల తెలుగు స్టార్ నటి సమంత మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలియగానే ఆడియన్స్ షాక్ కు గురయ్యారు. లేటెస్ట్ గా మరో బాలీవుడ్ నటుడు ఓ భయంకర వ్యాధితో బాధపడుతున్న ప్రకటించడం అందరినీ కలిచివేసింది. బీ టౌన్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ ‘వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్’ అనే వ్యాధికి గురైనట్లు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. ఆయన కృతి హాసన్ తో కలిసి నటించిన లేటేస్ట్ మూవీ ‘భేదియా’. దీనిని తెలుగులో ‘తోడేలు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన వరుణ్ ధావన్ తనకున్న వ్యాధి గురించి చెప్పారు.

వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ వ్యాధి చాలా అరుదైనది. ఇది వచ్చిన వారి శరీరంలోని బ్యాలెన్సింగ్ కోల్పోవడంతో పాటు వికారం, వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. సరిగా ఒకచోట కూర్చోలేకపోవడం, కొన్ని సార్లు శరీరం పూర్తిగా నియంత్రణ లేకపోవడం జరుగుతుంది. అలాగే ఈ వ్యాధి చెవి నుంచి మెదడుకు చేరే సంకేతాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల కళ్లు తిరగడం, మసకబారడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పెరిఫెరల్ లేదా సెంట్రల్ వెస్టిబ్యులర్ సిస్టమ్ పాక్షికంగా లేదా పూర్తిగా పనిచేయకపోవడాన్ని వెస్టిబ్యులర్ హైపో ఫంక్షన్ అని అంటారు.
డైరెక్టర్ డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని ఈయన 2010లో ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమాకు కరణ్ జోహార్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. 2012లో కరణ్ దర్శకత్వంలో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాకు వరుణ్ కు బెస్ట్ మేల్ డెబ్యూ నామినేషన్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డు దక్కింది. ఆ తరువాత కూలీ నెంబర్.1, తదితర సినిమాల్లో నటించారు.

ఆయన తాజాగా భేదియా అనే సినిమాలో నటించారు. ఈ సినిమాను తెలుగులో ‘తోడేలు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ బాధాతప్త హృదయంతో తనకొచ్చిన వ్యాధి గురించి తెలిపారు. ‘ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్’ వ్యాధితో ఎన్నో కఠినతరమైన రోజులను చూశాను. ఆయన ఆగకుండా పరెగెత్తుతున్నాను. ఈ భూమిపై మనం రన్నింగ్ రేసులో ఉన్నాం. ఈ పరుగు ఎందుకని ఎవరూ అడగరు.’ అంటూ కన్నీరు పెట్టాడు వరుణ్ ధావన్. ఇక ఈ వ్యాధి గురించి తెలియగానే ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.