Orange peels forest restoration story: వాడుకున్న తర్వాత.. ఏ మాత్రం కనికరం లేకుండా మనుషులు వస్తువులను పడేస్తుంటారు. అవి ఎందుకూ పనికిరావనే ఒక బలమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కాకపోతే పనికిరాని వస్తువులను పనికివచ్చే విధంగా చేయాలంటే దానికి కాస్త ఓపిక ఉండాలి. కానీ ఈ ఓపిక అందరికీ ఉండదు. అందువల్లే వస్తువులను వాడుకున్న తర్వాత మరో మాటకు తావుకుండా బయటపడేస్తుంటారు. ఒకరకంగా భూమిని డంపింగ్ యార్డ్ లాగా మార్చేస్తుంటారు. ఇక ఇటీవల కాలంలో ఈ – వస్తువుల వినియోగం పెరిగిన నేపథ్యంలో.. వాటిని ఒక స్థాయి వరకు వాడేసి తర్వాత పడేస్తున్నారు. దానివల్ల ఈ – వ్యర్ధాల కాలుష్యం పెరిగిపోతున్నది. వీటిని రీసైక్లింగ్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు వచ్చినప్పటికీ.. ఉత్పత్తికి, రీసైక్లింగ్ చేసే వాటికి చాలా అంతరం ఉంటున్నది.
Also Read: Anemia: రక్తహీనతను దూరం చేసే 5 రకాల పండ్లు ఇవే!
వ్యర్ధాలు వనరులుగా మారాయి
సాధారణంగా మనం ఏవైనా పండ్లు తిన్నప్పుడు వాటి తొక్కలను బయటపడేస్తుంటాం. పండు మాత్రమే తిని తొక్కలు అనవసరమని భావించి ఎక్కడ ఒకచోట జారవిడుస్తుంటాం. కాకపోతే అవే తొక్కలు ఒక బీడు భూమిని సారవంతం చేశాయి. ఏకంగా ఒక అడవిని సృష్టించాయి.. 1990లో కోస్టారికా (Costa Rica) లో ఓ కంపెనీ నారింజ పండ్ల రసాన్ని తయారు చేసేది. ఆ రసాన్ని విక్రయించేది. రసం తీసిన తర్వాత తొక్కలను ఒక బీడు బంజరు భూముల్లో డంపు చేసేది. అయితే ఆ తొక్కలు కాలక్రమంలో కుళ్లిపోయాయి. ఏకంగా నేలను సారవంతం చేశాయి. సారవంతమైన నేల మీద మొక్కలు పెరగడం ప్రారంభమైంది. ఆ మొక్కలు ఎదగడంతో ఆ ప్రాంతం మొత్తం అడవిలాగా మారిపోయింది. చుట్టుపక్కల ఉన్న నేలతో పోల్చి చూస్తే అక్కడి నేలలో మాత్రం చెట్లు విపరీతంగా పెరిగాయి. ఒకరకంగా అక్కడ అడవి వెలసింది. ఇటీవల ఈ దృశ్యం వెలుగులోకి వచ్చింది.. అదికాస్తా సోషల్ మీడియాలో పడటంతో వైరల్ గా మారింది.
Also Read: Fruits: రాత్రిపూట ఈ పండ్లు తింటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త!
“కోస్టారికా ప్రాంతంలో ఆరెంజ్ జ్యూస్ తయారుచేసే కంపెనీ ఉంది. నారింజ పండ్ల నుంచి రసం తీసిన తర్వాత మిగిలిన తొక్కలను ఇక్కడ పడవేసింది. కాకపోతే ఇది బీడు భూమి కావడంతో ఎవరూ పెద్దగా ఎదురు చెప్పలేదు. దాదాపు 12 వేల టన్నుల నారింజ తొక్కలను ఆ కంపెనీ ఇక్కడ పడేసింది. కాలక్రమంలో ఆ నారింజ తొక్కలు భూమిలో కలిసిపోయాయి. ఎరువుగా మారిపోయాయి. ఆ ప్రాంతంలో ఉన్న భూమిని మొత్తం సారవంతం చేశాయి. సారవంతమైన భూమి కావడంతో మొక్కలు వేపుగా పెరగడం మొదలైంది. అప్పటిదాకా బీడుగా ఉన్న ఆ ప్రాంతం మొత్తం ఇప్పుడు ఒక అడవిని తలపిస్తోంది. రకరకాల చెట్లు, తీగజాతులు అక్కడ కనిపిస్తున్నాయి. అడవి ఏర్పడిన నేపథ్యంలో చాలావరకు జంతువులు అక్కడ జీవిస్తున్నాయి. రాత్రిపూట ఆ చెట్ల కింద సేద తీరుతున్నాయి. ఈ ప్రపంచంలో వ్యర్ధానికి అర్థం ఉందని ఈ సంఘటన నిరూపిస్తోందని” కోస్టారికా ప్రాంతంలోని స్థానికులు చెబుతున్నారు.. ఇక సోషల్ మీడియాలో ఈ విషయం వెలుగు చూడటంతో.. ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి చాలామంది వస్తున్నారు.