Gambhir Team Selection: మరో రెండు రోజుల్లో గిల్ ఆధ్వర్యంలో భారత జట్టు ఇంగ్లీష్(ENG vs IND) జట్టుతో తలపడుతుంది. ఇంగ్లీష్ గడ్డమీద ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే భారత జట్టు ఆంగ్ల గడ్డమీద అడుగుపెట్టింది. ప్రాక్టీస్ మ్యాచ్ లు, అనధికారిక టెస్టులు ఆడింది. వీటి ద్వారా భారత ప్లేయర్లు తమ నైపుణ్యానికి ఎంతోకొంత సాన పెట్టుకున్నారు.
ఇక ఇంగ్లాండ్ జట్టుతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు భారత బృందంలోకి హర్షిత్ రాణా(Harshit Rana) ను తీసుకున్నారు. ఇతడు తీసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. గత ఏడాది కంగారు జట్టుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ కు రాణా ఎంపికయ్యాడు. ఆ సిరీస్ లో అతడు 4 వికెట్లు మాత్రమే సాధించాడు. ఇక ఇటీవల ఆంగ్ల జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో అతడు ఒక వికెట్ మాత్రమే సాధించాడు. అటు కంగారు జట్టుతో, ఇటు అనధికారికంగా జరిగిన టెస్టులో రాణా దారుణంగా విఫలమయ్యాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక చేతులెత్తేశాడు.. దీంతో అతడిని ఆంగ్లజట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. వాస్తవానికి ఇతడి కంటే కూడా అన్షుల్ కాంబోజ్(Anshul Kamboj) ఆంగ్ల జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టాడు.. అంతేకాదు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు.. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దుమ్మురేపాడు. అయితే అటువంటి బౌలర్ కు అవకాశం ఇవ్వకుండా రాణా ను జట్టులోకి తీసుకోవడం ఏంటని అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Also Read: New rule in cricket: క్రికెట్లో కొత్త నిబంధన..ఇకనుంచి ఇలా క్యాచ్ పడితే నాటౌట్..
ఇటీవల ఆంగ్లజట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసినప్పుడు.. అందులో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పేరు లేదు. అతని పేరు లేకపోవడం పట్ల విలేకరులు ప్రశ్నించారు. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదని అడిగారు. దానికి అజిత్ అగార్కర్ జట్టులో అన్ని స్థానాలు భర్తీ అయ్యాయని పేర్కొన్నాడు. మరోవైపు గౌతమ్ గంభీర్ మాత్రం ఆటగాళ్ల ఎంపిక విషయం తన చేతిలో ఉండదని వ్యాఖ్యానించాడు. దీంతో గౌతమ్ గంభీర్ వల్లే అయ్యర్ కు టెస్ట్ జట్టులో చోటు లభించడం లేదని అందరికీ అర్థమైంది. అయితే బీభత్సమైన ఫామ్ లో ఉన్న అయ్యర్ ను కాదని రాణా ను జట్టులోకి తీసుకోవడం పట్ల గౌతమ్ గంభీర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ లో షారుక్ ఖాన్ జట్టులో రాణా ఆడుతున్నాడు కాబట్టి… గతంలో గౌతమ్ గంభీర్ ఆ జట్టుకు మెంటర్ గా పనిచేశాడు కాబట్టి.. పైగా రాణా తో మంచి బాండింగ్ ఉంది కాబట్టి.. ఇప్పుడు టెస్ట్ జట్టులోకి ఎంపిక చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతిభ ఉన్న ప్లేయర్లకు అవకాశం ఇవ్వకుండా.. ఏమాత్రం ఆకట్టుకొని వాళ్లకు చోటు కల్పిస్తే ట్రోఫీలు ఎలా సాధ్యమవుతాయని.. విజయాలు ఎలా దక్కుతాయని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అయ్యర్, కాంబోజ్ కు కనుక జట్టులో చోటు కల్పించినట్లయితే బాగుండేదని.. దానివల్ల ఆంగ్ల జట్టుకు మన జట్టు బలమైన పోటీ ఇచ్చేదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.. విదేశీ పిచ్ ల పై వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్లేయర్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని.. అప్పుడు మాత్రమే విజయాలు దక్కుతాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కంగారు జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో విఫలమైన రాణాకు అవకాశం ఎందుకు కల్పించారని.. అతడు జట్టులో ఉంటే జరిగే లాభం ఏంటని? నెటిజన్లు గౌతమ్ గంభీర్ ను ప్రశ్నిస్తున్నారు.