Omicron: ప్రజలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు షాక్!

Omicron: కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. గత కొన్ని నెలలుగా కరోనా కేసులు తగ్గినా తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఈ కొత్త వేరియంట్ పేరు ఒమిక్రాన్ కాగా ఇది డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. బోట్స్ వానా, హాంకాంగ్, ఇజ్రాయెల్, బెల్జియంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లు […]

Written By: Navya, Updated On : November 27, 2021 11:58 am
Follow us on

Omicron: కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. గత కొన్ని నెలలుగా కరోనా కేసులు తగ్గినా తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఈ కొత్త వేరియంట్ పేరు ఒమిక్రాన్ కాగా ఇది డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. బోట్స్ వానా, హాంకాంగ్, ఇజ్రాయెల్, బెల్జియంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

Omicron

కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లు సైతం ఈ కొత్త వేరియంట్ బారిన పడుతుండటం గమనార్హం. దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండగా కొత్త వేరియంట్ వల్లే కేసులు పెరుగుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్, బ్రిటన్ దేశాలు కొత్త వేరియంట్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తుండటం గమనార్హం. అయితే మన దేశంలో మాత్రం ఈ కొత్త వేరియంట్ కు సంబంధించి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Also Read: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ!

ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త వేరియంట్ కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నాయని వెల్లడించింది. దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్ ఫ్రావిన్స్ అనే ప్రాంతంలో నమోదవుతున్న కరోనా కేసులలో 90 శాతం కేసులకు ఈ కొత్త వేరియంట్ కారణమని తెలుస్తోంది. శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ ను ఏమార్చి ఇది శరీరంలోకి వ్యాపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ నుంచి తప్పించుకునే సామర్థ్యం ఈ వేరియంట్ కు ఉంటే మరోసారి కరోనా ఉధృతి తప్పకపోవచ్చు.

ఈ వైరస్ యొక్క స్ప్రైక్ ప్రోటీన్ లో 32 ఉత్పరివర్తనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

Also Read: రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్!