https://oktelugu.com/

Mahesh babu In EMK: ఎన్టీఆర్ తో గేమ్.. ఇంతకీ మహేష్ ఎంత గెలుచుకున్నాడంటే?

Mahesh babu In EMK: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ బుల్లితెరపై సందడి చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే రాజమౌళి, కొరటాల, సమంత, రాంచరణ్ సహా హేమాహేమీలను తన షోకు ఆహ్వానించి ఎన్టీఆర్ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. ఇప్పుడు అంతకుమించిన ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు జూనియర్ రెడీ అయ్యారు. ఈసారి స్టార్ హీరో మహేష్ బాబును గెస్ట్ గా పిలిచాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు మహేష్ వచ్చిన ప్రోమో.. అందులో ఎన్టీఆర్ తో కలిసి […]

Written By: , Updated On : November 27, 2021 / 11:29 AM IST
Follow us on

Mahesh babu In EMK: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ బుల్లితెరపై సందడి చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే రాజమౌళి, కొరటాల, సమంత, రాంచరణ్ సహా హేమాహేమీలను తన షోకు ఆహ్వానించి ఎన్టీఆర్ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. ఇప్పుడు అంతకుమించిన ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు జూనియర్ రెడీ అయ్యారు. ఈసారి స్టార్ హీరో మహేష్ బాబును గెస్ట్ గా పిలిచాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు మహేష్ వచ్చిన ప్రోమో.. అందులో ఎన్టీఆర్ తో కలిసి చేసిన సందడి అభిమానులను ఉర్రూతలూగించింది.

Mahesh babu In EMK

NTR mahesh evaru milo koteshwarlu

టాలీవుడ్ అగ్రహీరోలు వాళ్లు.. ఒకరేమో ఆల్ ఇండియా అందగాడు మహేష్ బాబు.. ఇంకొకరమే.. బై బర్త్ లోనే నటనను పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్ వారసుడు జూ.ఎన్టీఆర్. వీరిద్దరి మధ్య అనుబంధం ఈనాటిది కాదు.. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. మహేష్ సినిమాకు ఆ మధ్య ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మహేష్ ను మించిన అందగాడు లేడన్నారు. ఇక యాక్టింగ్ లో ఎన్టీఆర్ కొట్టే మొగాడు లేడంటూ మహేష్ ప్రశంసించాడు.

ఇద్దరూ అన్నాదమ్ముళ్లా కలిసిపోతారు. మరి వీరిద్దరూ ఒకే చోట చేరితే.. సందడి చేస్తే.. ఆ అల్లరి మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే జరిగింది. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.

‘వెల్ కం మహేష్ అన్నా’ అని జూనియర్ ఎన్టీఆర్ ప్రేమగా పిలవడం.. దానికి మహేష్ అంతే ప్రేమగా జూనియర్ ఎన్టీఆర్ ను హగ్ చేసుకోవడంతో ఈ ఇద్దరి అభిమానుల కళ్లకు పండగలా మారింది.ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో మహేష్ బాబు ఎంత గెలుచుకున్నాడన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

Also Read: ఆ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న త్రివిక్రమ్…

ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు మహేష్ చాలా సరదాగా సమాధానాలిచ్చారట.. నవ్వులు పంచి.. తనదైన డైలాగులతో ప్రేక్షకులను అలరించాడట.. ప్రతీ గెస్ట్ గెలుచుకున్నట్టే మహేష్ బాబు కూడా ఎన్టీఆర్ తో గేమ్ ఆడి రూ.25 లక్షలు గెలిచాడని.. తన సేవా కార్యక్రమాలకు వాటిని విరాళం ఇచ్చాడని సమాచారం. చిన్నారులకు గుండె ఆపరేషన్ల కోసం వాటిని వినియోగించనున్నాడట.. ఇలా శ్రీమంతుడు చేసిన మంచిపనిని ఎన్టీఆర్ అభినందించారట..

మరి ఎన్టీఆర్ ఏం ప్రశ్నలు అడిగారు? మహేష్ ఏం సమాధానాలిచ్చారు? వీరి మధ్య జరిగిన సరదా సంభాషణ ఏంటనేది ఎపిసోడ్ ప్రసారం అయితే కానీ చెప్పలేం.. చూడాలి మరి ఆ సందడి ఎలా ఉంటుందో..

https://www.youtube.com/watch?v=DCwU8pNi9A8

Also Read: కపిల్ దేవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 83 మూవీ యూనిట్…