RRR Troll: ‘మావా.. సినిమాలో ఐటెం సాంగ్​ లేదా’.. ‘ఆర్​ఆర్​ఆర్​’ టీమ్ రిప్లై చూస్తే షాక్​?

RRR Troll: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు భారీ లెవెల్​లో ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని జనని పాటను విడుదల చేయగా.. భారీ రెస్పాన్స్​ వచ్చింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా […]

Written By: Raghava Rao Gara, Updated On : November 27, 2021 12:08 pm
Follow us on

RRR Troll: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు భారీ లెవెల్​లో ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న.

RRR Movie

ఈ క్రమంలోనే ఈ సినిమాలోని జనని పాటను విడుదల చేయగా.. భారీ రెస్పాన్స్​ వచ్చింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఈ పాటపై భావోద్వేగంతో కామెంట్లు చేశారు. విజువల్స్​, ఎమోషన్స్​, సాంగ్​ అన్నీ వేరే లెవెల్​లో ఉన్నాయంటూ పేర్కొన్నారు. అయితే, ఆర్​ఆర్​ఆర్​ టీంకు ఓ నెటిజన్​కు మధ్య ట్విట్టర్​లో జరిగిన ఫన్నీ సంభాషన ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది. అందరూ ఈ పాటపై ప్రశంసలు కురిపిస్తుంటే.. ఓ నెటిజన్​ మాత్రం వెరైటీగా స్పందించాడు.

Also Read: అందుకే రాజమౌళిని తోపు అనేది.. ఈ 3 ఆర్ఆర్ఆర్ సీన్స్ వెనుక ఎంత లోతుందో తెలుసా?

సినిమాలో ఐటెం సాంగ్​ లేదా మావా.. ? అంటూ ఆర్ఆర్​ఆర్​ టీమ్​ను ట్యాగ్​ చేశాడు. అయితే, దీనికి అంతే కూల్​గా సినిమా మేకర్స్ స్పందిస్తూ.. నువ్వు చేస్తావా?. అని బ్రహ్మానందం ఫన్నీ ఎక్స్​ప్రెషన్​ను జోడించడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ కన్​వర్జేషన్​ నెట్టింట వైరల్​గా మారింది.

డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు. అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: ‘ఆర్​ఆర్​ఆర్’​కు అక్కడ పెద్ద సమస్యగా మారిన ‘రాధేశ్యామ్’​!