Oil Purity Test: వంటనూనెలో కల్తీ జరిగిందో లేదో ఎలా గుర్తించాలో మీకు తెలుసా?

Oil Purity Test: మన వంటకాల్లో నూనెను ఎక్కువగా వినియోగిస్తామనే సంగతి తెలిసిందే. గడిచిన కొన్ని సంవత్సరాల్లో వంటనూనె ధరలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి వంటనూనె ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. నూనె లేనిదే వంట చేయడం సాధ్యం కాదనే విషయం తెలిసిందే. అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో వంటనూనెను కల్తీ చేస్తున్నారు. వంటనూనె కల్తీ వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. అధికారులు ఎన్ని చర్యలు […]

Written By: Navya, Updated On : September 17, 2021 3:50 pm
Follow us on

Oil Purity Test: మన వంటకాల్లో నూనెను ఎక్కువగా వినియోగిస్తామనే సంగతి తెలిసిందే. గడిచిన కొన్ని సంవత్సరాల్లో వంటనూనె ధరలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి వంటనూనె ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. నూనె లేనిదే వంట చేయడం సాధ్యం కాదనే విషయం తెలిసిందే. అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో వంటనూనెను కల్తీ చేస్తున్నారు. వంటనూనె కల్తీ వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది.

అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కల్తీ వంటనూనెలు మార్కెట్ లోకి వస్తుండటం గమనార్హం. కల్తీ నూనె వల్ల ఆరోగ్య సమస్యలు వేధించడంతో పాటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థీ ఏర్పడుతుంది. ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా వంటనూనె కల్తీ అయిందో లేదో అనే విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో వెల్లడించింది. వంటనూనెను ఎక్కువగా ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌ అనే కెమికల్ ను వినియోగించి కల్తీ చేస్తారు.

ఈ కెమికల్ ను కలిపిన వంటనూనెను వాడితే పక్షవాతం, ఇతర రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా పాత్రలో వంటనూనెను తీసుకొని అందులో పసుపు రంగులో ఉన్న వెన్నను వేయాలి. వెన్న వేసిన తర్వాత నూనె రంగు మారితే కల్తీ జరిగిందని భావించాలి. నూనె రంగు మారకపోతే మాత్రం ఆ నూనెల్లో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ లేదని అర్థం చేసుకోవాలి. నూనెలో కల్తీ జరిగితే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలి.

కల్తీ వంటనూనెను వాడటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వంటనూనెను వాడేవాళ్లు నెలకు ఒకసారి అయినా వంటనూనెలో కల్తీ జరిగిందో లేదో చెక్ చేసుకుంటే ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.