ఒక రూంలో ఇద్దరు అమ్మాయిలు.. ముగ్గురు అబ్బాయిలు.. ‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ కథ

లేట్ గా వచ్చినా లేటెస్ట్ ఆలోచనలతో తెలుగు తెరపై చెరగని ముద్ర వేస్తోంది మా ‘oktelugu.com’. అటు వెబ్ సైట్ లో దుమ్మురేపే సినీ, రాజకీయ, వర్తమాన, సమకాలీన అంశాలతో పాఠకులకు చేరువ అవుతూ.. ఇటు యూట్యూబ్ ద్వారానూ  ముందుకు సాగుతోంది. వెబ్ సైట్, యూట్యూబ్ రెండు పాఠకులకు చేరేలా సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది.. ఈ క్రమంలోనే వార్త కథనాలే కాదు.. సొంత క్రియేటివిటీ ఆలోచనలతో వచ్చే వారిని మా ‘oktelugu.com’ యాజమాన్యం ప్రోత్సహిస్తోంది. ఈ […]

Written By: NARESH, Updated On : January 4, 2021 4:52 pm
Follow us on

లేట్ గా వచ్చినా లేటెస్ట్ ఆలోచనలతో తెలుగు తెరపై చెరగని ముద్ర వేస్తోంది మా ‘oktelugu.com’. అటు వెబ్ సైట్ లో దుమ్మురేపే సినీ, రాజకీయ, వర్తమాన, సమకాలీన అంశాలతో పాఠకులకు చేరువ అవుతూ.. ఇటు యూట్యూబ్ ద్వారానూ  ముందుకు సాగుతోంది. వెబ్ సైట్, యూట్యూబ్ రెండు పాఠకులకు చేరేలా సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది..

ఈ క్రమంలోనే వార్త కథనాలే కాదు.. సొంత క్రియేటివిటీ ఆలోచనలతో వచ్చే వారిని మా ‘oktelugu.com’ యాజమాన్యం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే నవతరం ఆలోచనలకు ప్రతిబింబించేలా ‘రూమ్మేట్స్’ పేరుతో ఒక వెబ్ సిరీస్ ను తాజాగా లాంచ్ చేశాం.. ఇందులో ఎపిసోడ్ -1ను నిన్న విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్-2 సాయంత్రం 5 గంటలకు లాంచ్ అవ్వబోతోంది.

బిగ్ బాస్ హౌస్ ను పోలేలా ‘గుండు బాస్ హౌస్’ కాన్సెప్ట్ తో ఒక ఇంట్లో ఐదుగురు యువత చేసే అల్లరే మా ‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ కాన్సెప్ట్. ఇప్పటికే తొలి ఎపిసోడ్ పాఠకుల హృదయాలను తాకింది. అందులో పాత్రల ఇంట్రడక్షన్ వారి ఆటిట్యూడ్ కు జనాలు కనెక్ట్ అయ్యారు. ఒక రూంలో చేరిన ఐదుగురు భిన్న రకాల యూత్ కలిసి ఎలా ఆ రూంలో ప్రయాణం చేస్తారు? వారి కష్టనష్టాలు ఏంటి? వారి ప్రయాణం సాగుతుందా లేదా అన్నది రెండో ఎపిసోడ్ లో చూపించబోతున్నాం..

మొదటి ఎపిసోడ్ ను చూసిన పాఠకులంతా రెండో ఎపిసోడ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సాయంత్రం 5 గంటలకు రెండో ఎపిసోడ్ తో ప్రేక్షకుల ఉత్కంఠకు తెరదించుతున్నాం. మరో రెండు ఎపిసోడ్లు కూడా పాఠకులను రంజింప చేయడానికి రెడీగా ఉన్నాయి.

‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ కు కాన్సెప్ట్, దర్శకత్వాన్ని సాయి రాజేశ్ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్ క్రియేటివ్ హెడ్ గా సుందర్ ప్రపంచం వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ ఆకుమల్ల సినిమాటోగ్రఫీ చేస్తుండగా.. నితిన్ కుమార్ సిరీస్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.. సంగీతాన్ని ‘అబు’ అందిస్తున్నాడు.. ‘ఓకే తెలుగు’ సమర్పిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను ఆదరించండి..మా చానెల్ ను లైక్ చేయండి.. షేర్ చేయండి..

మరి ఇంకెందుకు ఆలస్యం.. మా తొలి ఎపిసోడ్ ను చూసేయండి.. రెండో ఎపిసోడ్ ను ఈ సాయంత్రం చూసేందుకు రెడీ అవ్వండి..