Sleeping Tips: సరిగ్గా నిద్రపోవడం లేదా? అయితే ఈ సమస్య బారిన పడినట్టే..

గత రెండు దశాబ్దాలుగా చేసిన అధ్యయనంలో దాదాపు నలుగురిలో ఒక మహిళ అధిక నిద్రలేమి లక్షణాలతో బాధపడుతున్నారని తేలింది. అలాంటి వారిలో 70 శాతం హృదయ సంబంధ ఘటనల ముప్పు ఉంటుందని గుర్తించారు.

Written By: Swathi Chilukuri, Updated On : February 28, 2024 4:33 pm
Follow us on

Sleeping Tips: నిద్ర అందరికి చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర కావాల్సిందే. ముఖ్యంగా సరిగా నిద్రపోని మహిళలకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తేల్చింది పిట్స్ బర్గ్ యూనివర్సిటీ రిసెర్చ్. నిద్రలేమితో బాధపడే మహిళల్లో గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి హృదయ సంబంధ సమస్యల రిస్క్ పెరుగుతోందని అధ్యయనంలో తేలింది. ఈ వెబ్ సైట్ ప్రకారం.. రెబెక్కా థర్స్ టన్ నేతృత్వంలో టీమ్, ఈ అధ్యయనం చేపట్టింది.

నలుగురిలో ఒక మహిళలకు నిద్రలేమి లక్షణాలు..
గత రెండు దశాబ్దాలుగా చేసిన అధ్యయనంలో దాదాపు నలుగురిలో ఒక మహిళ అధిక నిద్రలేమి లక్షణాలతో బాధపడుతున్నారని తేలింది. అలాంటి వారిలో 70 శాతం హృదయ సంబంధ ఘటనల ముప్పు ఉంటుందని గుర్తించారు. ఎక్కువ నిద్రలేమితో బాధపడే స్త్రీలకు, తక్కువ నిద్రతో పాటుగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం 75 శాతంగా ఉంటుందట. రక్తపోటు కూడా కాలక్రమేణా పెరుగుతుందట.

నిద్రలేమి చికిత్స ప్రాముఖ్యత..
డాక్టర్ థర్స్ టన్ మాట్లాడుతూ.. ఈ పరిశోధన మహిళల మిడ్ లైఫ్ లో తగినంత నిద్ర లేకపోవడం, మహిళల హృదయ ఆరోగ్యానికి నిద్రలేమి మధ్య సంబంధాన్ని వివరిస్తుంది అన్నారు. మహిళల ఆరోగ్యానికి మద్దతుగా నిద్రలేమి చికిత్స ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది అన్నారు.

చెక్ ఎలా పెట్టాలి.. నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టాలి అంటే.. మనసును శాంతపరచాలి. దీనికోసం ధ్యానం, యోగా వంటివి ప్రాక్టీస్ చేయాలి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన కంట్రోల్ చేసుకోవచ్చు. హెల్త్ లైన్ రిపోర్ట్ ప్రకారం వారానికి 150 ని. లు వ్యాయామం చేస్తే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది అని తెలిపింది. డైట్ లో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఆరోగ్యకర జీవన శైలిని అలవర్చుకోవాలి. పోషకాలు సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు తరచుగా తీసుకుంటూ ఉండాలి.